తిరుప్పావై;- కొప్పరపు తాయారు
    1) మొదటి పాశురం
===================
   మార్గళి  తింజ్ఞల్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ 
    ప్పోదువీర్, పోదు మినో నేరిలై యీర్ శీర్
    మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వి చ్చిరు మీర్ కాళ్
     కూర్వేల్  కొడున్దాళిలన్  నన్దగోపన్ కుమరన్
    ఏరార్ న్ద  కణ్ణి యశోదై  యిళంశింగమ్
     కార్ మే నిచ్చజ్ఞ్గణే కదిర్మదియం బోల్ పారోర్
     పుగళప్పడిన్దేలో  రెమ్బావాయ్ !
శోభితులైన గోపికలారా! మార్గశిర మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులువి. సూర్యుడైన నందగోపుని కుమారుడు ను,
విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడు ను, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడును, సూర్యుని వలె తేజోమయుడును అయినా నారాయణునే తప్ప,
ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతము నకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున  మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దాని కంగమైన మార్గళి
 స్నానము చేయు కోరిక గల వారందరును ఆలసింపక శీఘ్రముగా రండని, శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను, ఆహ్వానించుచున్నది!!!
                  ******

కామెంట్‌లు