తీరం......! - కోరాడ నరహసింహా రావు.
ఈ సంసార సాగరం లో..... 
   ఎంత విహరించినా.... 
      ఎప్పటికైనా... ఈ నావ
      తీర0 చెరాల్సి0దే.....! 

 పడవ నెక్కిన యే నావికుడై నా... విహారంలో...వినోదాన్నే... 
   అనుభవించాలనుకుంటాడు
 
ఆ విహారం మొదలైతేగానీ తెలియదు కదా...., 
ఈసాగరంలో...పెనుతుఫానులు, 
ఉప్పెనలు వచ్చి... అల్ల కల్లోలం సృష్ఠించి , 
నావను కకావికలం చేసేస్తాయని....! 
 అపుడీ నావ ఏ తీరానికి కొట్టుకు పోతుందో... 
నడి సముద్రం లోనే మునిగి పోతుందో ఎవరి కెరుక...!! 
 
నావికుడెంత వివేకపు తెరచాప నుకట్టినా... బుద్దికుశలతతో... 
 నావను నడిపే ప్రయత్న0 చేసినా..

. వైపరీత్యాన్ని తప్పించ గలడా.... పూర్వజన్మ పుణ్యముంటే తప్ప....!! 
     *******
కామెంట్‌లు