భారత నౌకాదళ దినోత్సవం(బాలపంచపది)-ఎం. వి. ఉమాదేవి
సువిశాలమైన సాగరజలాలు 
రవాణామార్గాలకు రక్షణలు
విపత్తులలో సహాయం చర్యలు
పలువిధాలు నౌకా దళం పనులు
దేశరక్షణ కీలక పాత్ర ఉమా!

మాదకద్రవ్యాల సరఫరాలు 
అక్రమరవాణాతో అవినీతులు
చేపలవేట సాయుధదోపిడీలు
సునామీ తుపాన్లో సహాయచర్యలు
సరిహద్దులో నిఘా ఉండు ఉమా!

చైనా దూకుడుకు కళ్లెము
ముత్యాల హారం చైనా పథకము
ప్రతిఘటనయే వజ్రాలహారము
భారత్కి జలాలపై పట్టువిధము
హిందూమహాసముద్రము ఉమా!

పాకిస్తాను , బంగ్లా, శ్రీలంకదేశాలు
మయన్మారు థాయిలాండు తీరాలు
డ్రాగన్ పెంచుకున్నది పట్టులు
జలాంతర్గాములు యుద్ధనౌకలు
చేపల పడవలు,శోధన ఉమా!

సాగరగర్భంలో డ్రోన్ల సంచారము
మన నౌకలకి ఆందోళనము
వాహకనౌక మానవ రహితము
బలీయనౌకా శక్తిగా భారతము 
చైనా చేయలేదు దిగ్బంధనం ఉమా!

ఆత్మ నిర్భరతగా యుద్ధనౌకలు
దేశీయనిర్మితము శ్రేణులు
జలాంతర్గాముల నిర్మాణములు
సామర్థ్యం పెంపుకు ప్రతిపాదనలు 
మానవరహిత డ్రోన్లనూ ఉమా!

గతంలోనే బంగాళాఖాతము
పిదప అరేబియా సముద్రము
హోర్ముడా జలసంది కాలక్రమము
మలక్కా, సుండా, లోంబాక్ తీరము 
విస్తరించే నౌకాదళం ఉమా!

ఇతరదేశాలతోటీ బంధాలు
కలిసి చేపట్టే విన్యాసములు
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండోనేషియాలు
రష్యా శ్రీలంక, థాయ్,బ్రిటన్ లు
అమెరికా,వియత్నాం ఒప్పందం ఉమా!

కామెంట్‌లు