బాల పంచపదులు - ఎం. వి. ఉమాదేవి
గణపతి ప్రార్థన

ప్రథమపూజలందుకొనెడి దేవా
విఘ్నాలు తొలిగించ వేగరావా
గౌరి ముద్దుతనయ గణేశదేవా
ప్రదక్షిణలతో విజయుడవైతివా
వందే శివ పుత్ర, శరణు!ఉమా!

శ్రీ శారదా నుతి

బాసరాంబాదేవి భవ్య వాణీ నమో 
హంసవాహని దివ్యరూపిణి నమో
అక్షరాభయమీవే ఆనందీ నమో 
శిక్షణ సరస్వతి చిద్రూపీ నమో
లక్ష్య సాధననీవే లాలిత్య ఉమా!!


అవతారిక

అంపశయ్యపైన భీష్మాచార్యుడు
అవసాన దశలోనయున్నాడు
పాండవులకు ఉపదేశమిచ్చాడు
శ్రీవిష్ణు సహస్రనామాలన్నాడు
జన్మసాఫల్యత పొందే ఉమా!


కామెంట్‌లు