బంగారు పిల్లలు- ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
బలే బలే పిల్లలు 
బంగారు పిల్లలు 
లంగా వోని కట్టారు
బుంగమూతి పెట్టారు

చెంగుచెంగు నురుకుతూ
బొంగరం మోలే తిరుగుతూ
గట్టు పక్కకు ఆగారు
గడ్డి పూలు కోశారు

చెట్టు కింద పోశారు
మాలలు వారు కట్టారు
రెండు బొమ్మలు తెచ్చారు
బొమ్మల పెళ్లి చేశారు

చప్పట్లు వారు కొట్టారు
బొబ్బట్లు చేసి పెట్టారు
పిల్లల పెద్దల పిలిచారు
అందరికీ వారు పంచారు


కామెంట్‌లు