జీవితం చిత్ర విచిత్రం- సి.హెచ్.ప్రతాప్

 \జీవిత ప్రయాణం అగమ్యగోచరం
అయోమయం,
ఎవరెవరు ఎందుకు కలుస్తారో,
ఎక్కడివరకు కలిసి నడుస్తారో
ఎప్పుడు ఎందుకు విడిపోతారో తెలీని స్థితి
ఇష్టమైన వ్యక్తుల నుండి విడిపోవచ్చు
ఇష్టం లేని వ్యక్తులతోనే
ప్రయాణం సాగవచ్చు
ఆనందాల హరివిల్లుగా లేదా
ఎడమొగం పెడమొగంగా సాగవచ్చు
ఆనందాన్ని ఇచ్చే ఒక తలుపు మూసుకుంటే
రెట్టింపు ఆనందానిచ్చే మరో తలుపు తెరుచుకోవచ్చు
మూసిన తలుపువైపే చూస్తూ
తెరుచుకునే తలుపును పట్టించుకోము
జీవితం ఎప్పటికప్పుడు కొత్తగా
సరికొత్తగా ఊహించని అనుభవాలనిస్తుంటుంది
పేరు, డబ్బు, అధికారం సాధించినా
పేదవారిగా జీవించినా
చివరి మజిలీ ఆరడుగుల గొయ్య వద్దకే
సంపాదించినవన్నీ అక్కడే వదిలేయాలి
సాధించుకున్న పాపపుణ్యాలే మనతో సాగుతాయి.
తోటివారికి మంచిని పంచి ఇస్తూ
అందరికీ తల్లో నాలుకలా మెదులుతూ
అందరి నోటా మంచి వ్యక్తిగా నలిగితే చాలు 
కామెంట్‌లు