తిరుప్పావై కొప్పరపు తాయారు
 🌻6వ,పాశురం🌻
    పుళ్ళుమ్  శిలుంబినకాణ్  పుళ్ళరయ్యాన్ 
     కోయిలిల్  వెళ్ళై  విళిశంగిన్  పేరరవమ్ కేట్టి
     లియో పిళ్ళా  యెళుంది. రాయ్. పేయ్ ములై 
      నంజుఱ్ఱు కళ్ళచ్చగ డం  కరక్కాయ క్కాలోచ్చి 
      వెళ్ళిత్తర  విల్ తుయిల. మరేన్  విత్తి నై
     ఉళ్ళత్తు  క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్ 
      మెళ్ళ వెళన్దు  ఆయన పేరరవమ్ ఉళ్ళమ్
      పుగన్దు  కుళిర్  న్దేలో రెమ్బావాయ్!

  అందరికంటే  ముందుగానే మేల్కొన్న వారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారినదమ్మా ఇక లేచి రావే అని లేపుచున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరె.  పక్షిరాజు గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణ ని కోవెలలో మ్రోగినవి వినలేదా ఓసీ పిచ్చి పిల్ల (భగవత్ విషయము మెరుగని దానా) శంఖధ్వనిని  నీవువినలేదా! లేచి రావమ్మా!  ఇదిగో ఫూతన స్థనములయందున్న విషాన్ని ఆరగించిన వాడు తనను చంపటానికి  వచ్చిన శకటాసురుని  కీళ్ళు ఊడు నట్లు తనకాళ్ళతో తన్ని న వాడు, అయినా శ్రీకృష్ణుడు  ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు.
      ఆ శ్రీమన్నారాయణిడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ  కలుగకుండు నట్లుగా మెల్లగా హరీ! హరీ! అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కొన్నాము. మరి నీవు మాత్రము కదలక అట్లే వరుంటివేమమ్మా! ఇది నీకు వినపడలేదా రమ్ము.! రమ్ము! మాతో కూడి వ్రతము చేయుము.
       ***🪷***

కామెంట్‌లు