విద్యతోనే ముందడుగు -తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, - వెంకట్ మొలక ప్రతినిధి

   10వ తరగతి విద్యార్థులకై రాష్ట్రవ్యాప్త ,మూడు నెలల ప్రేరణ కార్యక్రమ ప్రారంభం
 విద్యతోనే సమాజంలో గౌరవం-ముందడుగు సాధ్యమని, శాస్త్రీయ ప్రణాళిక -పునస్చరణతో పరీక్షల్లో విజయం సాధించవచ్చునని,విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు అనే నిచ్చెనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చునని విద్యార్థులు ఇటువంటి ప్రేరణ కార్యక్రమాలను సద్వినియోగపరుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి- బుర్రా వెంకటేశం అన్నారు. శుక్రవారం నాడు సచివాలయంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు మూడు నెలల పాటు నిర్వహించే రాష్ట్రవ్యాప్త ప్రేరణ కార్యక్రమన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారి, అన్ని యాజమాన్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆదేశించారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.కార్యక్రమ రూపకర్త సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించుట కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్ట్ల సంఘం సహకారంతో నిర్వహించనున్నామని, విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలని, వివరాలకు ఫోన్ నెంబర్  9989310141 లలో సంప్రదించాలనితెలిపారు. అనంతరం అతిధులు కార్యక్రమ పోస్టర్లు, బ్యానరు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేణు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు