తిరుప్పావై ; -వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
1వ పాశురము:-

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
_పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్!
***********
ఒకటవ పాశురం భావము పంచపదులలో
***********
వెన్నెల రోజులకై వేచి చూసెను
మార్గశిరము మంచిదనుకొనెను
మాధవమాసం ఇదియే అనెను
కన్నయ్య గుణములు కీర్తించెను
కృష్ణుని భర్తగ ఎంచి పూజించెను
...కృష్ణా 


తండ్రి మాటలు మీరడు యనెను
కెందామరల కన్నుల వాడనెను
సూర్య తేజమును కలవాడనెను
చంద్రుని వలెను చల్లని వాడనెను 
కన్నయ్యను గోదా పొగడుచుండెను
..కృష్ణా

తల్లి చాటు బిడ్డ ఈతడు అనెను
చిన్ననాటనే రక్కసుల దునిమెను
వేలాయుధుడు కన్నయ్య అనెను
కామేశ్వరి పూజ చేయుదమనెను
పరై వాయిద్యము పొందెదమనెను
....కృష్ణా
***********


కామెంట్‌లు