మనకు సర్వమూ తానే ....!
తల్లిని మించిన తల్లి, మనకు ఈ నేల తల్లి ...!!
సకల ప్రాణి కోటి జన్మకు...
మూలమూ తానే...!
ఎదుగుదలకు ఆధారమూతానే...!
తను లేని, మన మెక్కడ..!?
ఈ నేల తల్లి పచ్చ దనమే....
మనకు వెచ్చదనము...!
ఆరోగ్యము - ఐస్వర్యము!!
సుఖము - ఆనందము...
సర్వమూ..మనకు ఈనేలతల్లే
నీటి నుండి పుట్టిన ఈ నేలకు
నీరే... ఆధారం..!
ఆ నీటికి చెట్టు... చెట్టుకు నీరు
పరస్పరాధారితాలు..!!
నీరు లేనిదే... మొక్క లేదు..!
మొక్క లేనిదే నీరు రాదు..!!
విరివిగా...మొక్కలనుపెంచాలి
కాలుష్యాలు నిరోధించాలి
నేల తల్లి ని రక్షిం చాలి
మనమ్ కల కాలం...
హాయిగా... జీవించాలి...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి