అదుపు..పొదుపు!;- పద్మావతి ‌పి-హైదరాబాద్
చిట్టీ పొట్టీ బాలలూ
బుగ్గల నవ్వుల విందులు
నిర్మలమైన మనసులు
అమ్మా నాన్నల కనుపాపలు..

అల్లరి చేసే ఆటలు
అ ఆ ల అభ్యాసాలతో
గురువులం నేర్పే సుద్దులు
నేర్వాలీ! హద్దులు లేని విద్యలు!

ముద్దుగా లాలిస్తూ పెద్దలు
తాతా అమ్మమ్మల-నానమ్మల
వొడిలో మురిపాల ముద్దులతో
ముంచేస్తూ ఇస్తారు ప్రేమతో
రూకలు దొడ్డులు మెండుగా..

దాచాలీ పిన్నలు పదిలంగా
నేర్వాలీ పొదుపుని అభ్యాసంగా
చెయ్యాలీ అలవాటుని పెద్దలు
బాల్యం నుండీ వేయాలీ బాటను ఆత్మీయంగా..

వారు దాచుకున్న డబ్బులతో
పుస్తకాలను కానుకలను కొనిపిస్తూ
చిల్లర చిల్లరగా వాడుతూ ఉంటే
కోకొల్లల కోట్లైనా కరుగును అంటూ..

పొదుపు మీ భవితకు
బంగరు బాటంటూ
అదుపులో ఉండేందుకు
చిన్ని చిన్ని చిట్కాలంటూ
ఆటగా పాటగా నేర్పాలి పెద్దలు..

పొదుపుతో లాభం ఉందంటూ
దానం ధర్మం మించిన గుణమే లేదంటూ
అదుపులో ఉండేందుకు 
చేయాలీ ప్రయత్నం
పొదుపు మదుపుతో
ఆపదలో ఆదుకోవడం నేర్పాలి!

మనసుంటే మార్గం ఉంటుంది
ఎన్నో బ్యాంకులు కూడా
బాలల కోసం ఎన్నెన్నో పథకాలను
ప్రవేశ పెట్టింది
మదుపుగా పొదుపును చేయండి
ఆనందంగా భవితకు మదుపును చేయండి..
.............................................

కామెంట్‌లు