ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త రామానుజన్‌.

 ప్రపంచం గర్వించదగ్గ భారతీయ గణిత మేధావి, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అని, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు 
ఆమె అధ్యక్షత వహించారు. 
తొలుత రామానుజన్ చిత్రపటానికి నాగమణి పూలమాలవేసి నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా 
రామానుజన్ జీవితచరిత్రకు సంబంధించి వక్తృత్వ,
గణిత ప్రశ్నల క్విజ్ పోటీలను నిర్వహించారు. 
ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన దూసి శ్రావ్య, టొంపల అనూరాధ, డొంపాక కల్పన, ముంజి భాస్విక తదితరులకు బహుమతులు అందజేసారు. 
ప్రధానోపాధ్యాయులు బలగ నాగమణి, 
ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, 
గోగుల సూర్యనారాయణ, సిద్ధాబత్తుల వెంకటరమణ, 
కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు