సృష్టి రహస్యం;- సి.హెచ్.ప్రతాప్

 జననం మరణమైనా
శాశ్వతం అశాశ్వతమైనా
కొటీశ్వరుడు భిక్షకుడైనా
చక్రం తిప్పే నాయకుడు
పదవిచ్యుతుడై ఒంటరివాడైనా
శాశ్వతమనుకున్న ఐశ్వర్యం
లిప్త కాలంలో కరిగిపోయినా
మనుష్యులను కలిపి వుంచే
బంధాలు పుటుక్కున తెగిపోయినా
పండు బీజమైనా
ఆకులు రాలి చెట్లకు ఎరువైనా
బిందువు వానైనా
స్త్రీ పురుష సమాగమం
బీజోత్పత్తికి అంకురమైనా
కోయిల మధుర గానమాలపించినా
అంతా సృష్టిలో అంతర్భాగమే
సృష్టికి ఎదురీదక
ఫలితాలను సంతృప్తుడై
ఆస్వాదించడమే కర్తవ్యం
కామెంట్‌లు