అవ్వ చూపు! అచ్యుతుని రాజ్యశ్రీ

 స్త్రీలకు బస్సు ఫ్రీ నేపధ్యంలో
అల్లిన కవిత
----------------------------
ఆ దిక్కే అవ్వచూపు
కిటకిట లాడుతూ ఆడపిల్లలు
యువతులు వృద్ధాంగనలు
బస్సు కోసం బారులు బారులు
ఆగింది బస్సు
ఎగిరే సీతాకోక చిలుకలు
ఎక్కలేక కిటకిట వత్తిడికి
తట్టుకోలేక
కాలుజారి కింద పడిన అవ్వ!
ఆదిక్కే అవ్వచూపు
పట్టెడు బువ్వ
గుక్కెడు నీటికోసం
ఒంటిగా రెక్కలు తెగినపావురం
ఒళ్ళంతా ముడతలు
గుంటలు పడిన కనులు
కొబ్బరిపీచు తెల్లజుట్టు
ప్రాణమున్న కట్టె
జావలా జారిపోతోంది
కొమ్మపైని పిట్టలు జాలిగా
నిక్కి నిక్కి చూసే
ఈలోకం విడిచిన అవ్వవీపుకి
 వెచ్చగా ఆనుకునే కుక్క పిల్ల🌷
కామెంట్‌లు