మార్పులుచేర్పులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్తనీరు
వచ్చింది
పాతనీరు
కొట్టుకుపోయింది

కరెంటుబుడ్లు
వచ్చాయి
నూనెదీపాలు
పోయాయి

సినిమాలు
వచ్చాయి
నాటకాలు
మాయమయ్యాయి

ఓటీటీలు
వచ్చాయి
సినిమాహాల్లు
మూతబడ్డాయి

టీవీలు
వచ్చాయి
రేడియోలు
కనుమరుగయ్యాయి

ఆంగ్లభాష
వ్యాపించింది
తెలుగువాడుక
తగ్గిపోయింది

మోటారుబండ్లు
వచ్చాయి
కాళ్ళనడకలు
తగ్గాయి

సెల్లుఫోనులు
వచ్చాయి
సొల్లుకబురులు
పెరిగాయి

ఈమైలు
వచ్చింది
ఉత్తరాలను
మరిపించింది

చుడీదార్లు
వచ్చాయి
చీరెలు
పోయాయి

కుట్టుమెషిన్లు
వచ్చాయి
పంచెలుకండువాలు
పోయాయి

బ్రాయిలరుకోళ్ళు
వచ్చాయి
నాటుకోళ్ళు
నశిస్తున్నాయి

ముఖపుస్తకం
వచ్చింది
ప్రత్యక్షముచ్చట్లు
తగ్గించింది

వాట్సప్పు
వచ్చింది
మాట్లాడటము
మరిపించింది

వచనకవిత్వం
వచ్చింది
పద్యకవిత్వం
బాగాతగ్గించింది

సెంట్లసీసాలు
వచ్చాయి
సుమసౌరభాలు
ఆస్వాదనలుతగ్గాయి

బాలుపాయింటుపెన్నులు
వచ్చాయి
ఇంకుకలాలు
మాయమైపోయాయి

కంప్యూటరులు
వచ్చాయి
టైపుమెషిన్లు
పోయాయి

క్యాల్కులేటరులు
వచ్చాయి
నోటిలెక్కలు
మరిచిపోయేలాచేశాయి

డెబిటుక్రెడిటుకార్డులు
వచ్చాయి
నగదుచలామణి
తగ్గించాయి

కృత్తిమరసాలు
వచ్చాయి
పండ్లరసాలు
త్రాగటంతగ్గింది

మార్పులు
గమనించండి
చేర్పులు
చేస్తుండండి


కామెంట్‌లు