సుప్రభాత కవిత - బృంద
జలజలా సాగిపోయే
కొండవాగు కబుర్లు
కోనంతా వింటూ
కలకలమని నవ్వుతుంటే...

బారుగా ఎదిగిన చెట్లు
ఏకాగ్రతగా ఏటికి రక్షణగా 
అంగరక్షకుల్లా నిలబడి
కాపలా కాస్తుంటే....

తొలికిరణపు జిలుగులు
ఒళ్ళంతా చుట్టుకుని
వయ్యారాలు పోతూ
వడివడిగా నీరు సాగిపోతుంటే..

కదిలిపోతున్న ప్రవాహానికి
వీడుకోలు చెబుతూ
వచ్చే కొత్తనీటికి స్వాగతమంటూ
పచ్చిక  సరాగాలాడుతుంటే....

పారుతున్నంత మేరా
చైతన్యం నింపుతూ
చేయికలుపుతూ
వనశోభలు పెంచుతూ...

సాగే ప్రవాహం లాగే
ప్రతి రోజూ అగమించి
ప్రతిమనసునూ  ఊరడించి
కొత్త ఊపిరి పోసే  వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు