నేస్తం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మధురమైన నీ స్నేహం 
మరువలేను ఓ నేస్తం! 
నీ పెదవులపై వాడని నవ్వు 
నా ఎదలో పూచే వెన్నెల పువ్వు
నీ కమ్మని మాటల చల్లదనం
నా బ్రతుకున చూపే తీయదనం 
నీ కన్నుల్లో మెరిసే కాంతి 
నా గుండెల్లో కురిపించే శాంతి 
అందుకే నీ స్నేహం 
మరువలేను ఓ నేస్తం! 
నా హృదయంలో మమతను చిలికి 
“నేనున్నాను నీ కోసం”అని పలికి 
నా మదిలో నిండుగ వెలిసిన మూర్తీ 
నేనిస్తున్నా గైకొనుమా మంగళహారతి! 
నా జీవన బృందావనిలో 
విరబూసిందో స్నేహపుష్పం 
అది రేకులు విప్పుతూ 
అందించింది వింత సౌరభం 
నా ప్రేమకు ప్రతిరూపం 
నాలో పూచిన ఈ కుసుమం 
అందుకే అది చేస్తున్నా 
నీకే సమర్పణం 
మాసి పోని నీ స్నేహం 
ఓ నేస్తం!
కావాలి కలకాలం!!
**************************************

కామెంట్‌లు