ఓ కవివర్యా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అలుపెరుగని బాటసారీ
నీ అక్షరప్రయాణం సాగించవోయ్

నిరంతర అన్వేషీ
నీ నిత్యవెతకులాట సాగించవోయ్

సాహిత్య సేద్యగాడా
నీ కవనకృషిని కొనసాగించవోయ్

అందాల అభిమానీ
నీ అద్భుతవర్ణనలను సాగించవోయ్

రవి సమానుడా
నీ రమణీయతెలుగువెలుగులు ప్రసరించవోయ్

కవన బ్రహ్మా
నీ అమోఘకవితలసృష్టిని సాగించవోయ్

పూల ప్రేమికా
నీ కయితాసౌరభాన్ని రాతలలోచల్లవోయ్ 

సాహితీ సేవకా
నీ కమ్మనికైతారచనలను సాగించవోయ్

కలం పట్టినవాడా
నీ భావకవితామృతాన్ని కురిపించవోయ్

అమలిన ప్రేమికుడా
నీ అందాలకవితాకన్యను మరువకోయ్

ప్రకృతి అరాధకుడా
నీ సహజసుందరారాధనను సాగించవోయ్

కల్పనా చాతుర్యుడా
నీ బావకవితాప్రావణ్యాన్ని చాటవోయ్


కామెంట్‌లు