నిశ్శబ్దం భయానకం- సి.హెచ్.ప్రతాప్

 జీవితం లో కొన్ని అనుభవాలు
మధురానుభూతిని మిగిల్చుతాయి
మరికొన్ని భీతి గొల్పుతాయి
ఆత్మీయుల మౌనం, మాయమైన అనుబంధాలు
ఒంటరితనం, తన వాళ్ళందరూ దూరం
ప్రేమరాహిత్యం, మనస్సులో నిశబ్దం
మౌనం కూడా మాట్లాడుతుంది
కాని నిశ్శబ్దం నైరాశ్యాన్ని మిగులుస్తుంది
చలన, చర్య రాహిత్యమే నిశబ్ద నిర్వచనం
మౌనాన్ని నిశబ్దంగా మారనీయొద్దు
వేల అర్ధాలున్న మౌన శబ్దం నిశ్శబ్దం
వేదనలో ఓడిన క్షణాలు
నిశబ్దంలోకి జారిపోయి
నిర్వేదాన్ని మిగులుస్తాయి
బ్రతుకు నుండి నిశ్శబ్దాన్ని తరిమేయాలి
లేకుంటే అగాధమై అంధకారం మిగులుస్తుంది
ఆనందాన్ని నిస్తేజం ఆక్రమిస్తుంది
బ్రతుకు అగాధంలోకి జారిపోతుంది
కామెంట్‌లు