దేశ మాత! అచ్యుతుని రాజ్యశ్రీ

 మాత దేశమాత ప్రతిమనిషి జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తారు.అమ్మ జన్మనిస్తుంది . దేశ మాత మనకు నిలువనీడ మనుగడ కి కారణం అవుతుంది.జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ .మరి భారతమాత అనగానే చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని కిరీటం తో అమ్మవారి లాగా కన్పడ్తుంది.తెలంగాణా తల్లి విగ్రహాన్ని మనం రోజూ చూస్తూ నే ఉన్నాం.మనభారతమాత ఎలా ఆకృతి దాల్చిందో తెలుసా? అవనీంద్రనాధ్ టాగూర్ తొలి సారి భారత
మాత చిత్రంని గీశారు.ఆమెను కేసరి రంగు చీరలో చిత్రించారు.నాల్గు చేతులున్నాయి.జపమాల( శ్రద్ధ కి ప్రతీక) వేదాలు  వరికంకులు వస్త్రం ఆమె నాల్గుచేతుల్లో చిత్రించారు ఆయన.ఆతర్వాత మూడు రంగుల జెండా పట్టుకుని పెద్ద పులి మీద కూచున్నట్లుగా  పులులు లాగుతున్న రథంపై ఆసీనురాలైన భారతమాత చిత్రం గీయబడింది.కొందరు సింహవాహనగా చిత్రంని గీశారు.
ఇతరదేశాల వారు కూడా స్త్రీ రూపంలోనే తమదేశమాత చిత్రాలు గీశారు.బ్రిటన్ లోబ్రిటైనియా ఫ్రాన్స్ లో మారియాన్  న్యూజిలాండ్ లో జీలైండియా స్వీడన్ లో మదర్ స్వేయా అమెరికాలో కొలంబియా దేవతలు ఆయా దేశాల మాతలుగా జనుల గౌరవమర్యాదలు భక్తి శ్రద్ధలు అందుకుంటున్నారు.బ్రిటానియా దేవత టోపి గ్రీకు హెల్మెట్ .చేతిలో డాలు పట్టుకుని ఉంటుంది.18 వశతాబ్దిలో స్కాట్లాండ్ ఇంగ్లాండ్ తో కల్సి పోయి యునైటెడ్ కింగ్డమ్ గా ఏకమైంది.ఆమె పెద్ద పులి పై కూచున్న భంగిమలో చిత్రం గీశారు.బ్రిటానియా చేతిలో సముద్ర దేవతపోసాయడన్ త్రిశూలంని  ఉంచి చిత్రం ని గీయటం జరిగింది.ఇంగ్లీష్ వారు తమ రాణులైన మొదటి ఎలిజబెత్ విక్టోరియా మహారాణిని ఆరాధించే రోజులవి.అలాగే బ్రిటానియా విగ్రహం ని ఆరాధించారు.న్యూజిలాండ్ వారు  జీలైండియా విగ్రహం ని స్వీడన్ లో మదర్ స్వేయా  ఐర్లాండ్ లో
కాథలిన్ నీ హూలిహన్ చిత్రాలు వచ్చాయి.
ఫ్రాన్స్ లో మారియాన్  అమెరికా లో కొలంబియా దేశమాతలుగా ప్రజల్లో దేశభక్తి రగిల్చారు.తాము పుట్టిన దేశం నా తల్లి గా కొల్చి ఆరాధించే సంస్కృతి ప్రపంచ మంతటా ప్రాకింది...
కామెంట్‌లు