మహిళ!!! ప్రతాప్ కౌటిళ్యా
నేను జలాన్ని
లోతైన చోటే
నదులన్నింటినీ కలిపి
మహాసముద్రం అవుతాను!!
నేను మహిళను!!!

నేను రాయిని
ఎత్తైన చోటే
ఒకదానిపై ఒకటి చేరి
మహా పర్వతాన్ని అవుతాను!!
నేను మహిళను!!

నేను విత్తనాన్ని
చుట్టుముట్టు చెట్లను చేర్చి
మహారాణ్యాన్ని అవుతాను!!
నేను మహిళను!!!!

మేము సూర్యచంద్రులం
కోట్ల నక్షత్రాలను పేర్చి
లక్ష్యం చేదించలేని
ఆకాశాన్ని నేను.!! నేను మహిళను!!!

నేను ప్రేమను
అది ఉన్నచోటే
మహావృక్షంలా పాతుకుపోతాను!!
నేను మహిళను!!!!

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు