ఇంకా ఎందుకు మిగులుతావు?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కళ్ళుకార్చే
కన్నీరుగా
కంట్లోపడిన
నలుసుగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

పగలునుతరిమే
చీకటిగా
తుపాకులుప్రేల్చే
తూటాగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

తలలునరికే
కత్తిలా
చేతులుకట్టేసే
పగ్గముగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

పగలునుతరిమే
చీకటిగా
దహనంచేసే
నిప్పుగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

మోములయందు
ఏడుపుగా
మదులయందు
దఃఖముగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

కాళ్ళకు గుచ్చుకొనే
కంటకములా
కాయానికి తగిలే
గాయములా
ఇంకా ఎందుకు మిగులుతావు?

రక్తముత్రాగే
దోమలా
దోపిడిచేసే
దొంగలా
ఇంకా ఎందుకు మిగులుతావు?

నదిప్రవాహములో
సుడిగుండముగా
ఉపరితలంపైన
సుడిగాలిగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

నింగినుండిపడే
పిడుగులా
జోరువానలతో
వరదగా 
ఇంకా ఎందుకు మిగులుతావు?

ప్రాణముతీసే
హంతకుడిగా
మానముచెరచే
మృగానివిగా
ఇంకా ఎందుకు మిగులుతావు?

పొలాల్లో
కలుపులా
పంటల్లో
చీడలా
ఇంకా ఎందుకు మిగులుతావు?

ఏలనో తడుతుంది
ఏదో వెలితి
ఎక్కడో గల్తి
ఎవిరిదో వేదన
ఎందుకో రోదన

ఇక సహించలేను
ఏడుపులను
బాధలను
కష్టాలను
నష్టాలను

ఇంకా మిగిలితే
తరుముతా
త్రొక్కుతా
తంతా
తగలేస్తా


కామెంట్‌లు