తిరుప్పావై ; -వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
15. పాశురము :
31-12-2023, ఆదివారము
**********
“ఎల్లే! ఇళంగిళియే ఇన్నమ్ ఉరంగుదియో?” “శిల్లెన్రు అళైయేన్ మిన్ నంగైమీర్! పోదరుగిన్రేన్” “వల్లై, ఉన్ కట్టురైగళ్! పడ్డే ఉన్ వాయ్ అరిదుమ్!” “వల్లర్ గళ్ నీంగళే నానే తాన్ అయిడుగ!” “ఒల్లై నీ పోదాయ్ ఉనక్కు ఎన్న వేరు ఉడైయై!" “ఎలారుమ్ పోన్దారో?“ పోన్దార్ పోనుదు ఎణ్ణిక్కొళ్; వల్లానై కొన్రానై, మాత్తారై మాత్తు అళిక్క వల్లానై, మాయనై ప్పాడు ఏల్ ఓర్ ఎంబావాయ్"
*********
15వ పాశురం - భావం- పంచపదులలో.
**********

చిలుక వంటి చినదానా నిద్దుర లేవే
మొద్దు నిదుర ఇంకేలనెనిద్దురలేవే
అందంగ  మాటలాడు చిన్నదానా లేవే 
నీ నేర్పు , తెలివీ మాకు తెలుసునులేవే
నిదుర లేచి నువు తెలుపు తీయవే చెలీ.. కృష్ణా (బయటి గోపికలు)

(లోపల ఉన్న గోపిక)👇

నుకుమారమైన దేహము కల్గినమీరు 
గట్టిగా ఎందుకలా అరచుచున్నారు
ఇంత గట్టిగా మాటాడకండి మీరు
ఎంతటి సమర్ధులో తెలుసులే మీరు 
తలుపు తీయుదును కదా వస్తున్నాగా.. కృష్ణా 

(బయటి గోపికలు)
పరాక్రమ వంతమైన ఏనుగునైనా ఓ చెలీ
తన పరాక్రమంతో అణచగలడు ఓ చెలీ
అనంతశయనుడు ఆదిదేవుడతడు చెలీ
అందరొచ్చారు  కన్నయ్యను కీర్తించుటకే చెలీ
మన గానముతో కృష్ణుని కీర్తింతుముగా .. కృష్ణా

మాటకు మాట చేటుయని మాకు తెలుసు ఓ చెలీ
నీ కొరకే వచ్చితిమి కదా నిదుర లెమ్ము ఓ చెలీ
స్నాన వ్రతమునకు సమయమిదే కదాలేవే చెలీ
పొద్దెక్కినది నిదుర లేచి తలుపుతీయవే ఓ చెలీ
నువు వేగమె రావేమె చెలీ పదవ గోపికా.... కృష్ణా
***********


కామెంట్‌లు