ఓ పువ్వా!- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కిలకిలనవ్వవే
పువ్వా
కళకళవెలుగవే
పువ్వా

అందాలుచూపవే
పువ్వా
ఆనందలునివ్వవే
పువ్వా

పరిమళాలుచల్లవే
పువ్వా
మత్తులోముంచవే
పువ్వా

మొగ్గతొడగవే
పువ్వా
ముద్దులొలకవే
పువ్వా

విచ్చుకొనవే
పువ్వా
వేడుకచేయవే
పువ్వా

తేటులనుపిలవవే
పువ్వా
తేనెచుక్కలివ్వవే
పువ్వా

కొప్పులకెక్కవే
పువ్వా
కోరికలులేపవే
పువ్వా

మాలలోచేరవే
పువ్వా
మెడనవ్రేలాడవే
పువ్వా

రెక్కలిప్పుకొనవే
పువ్వా
అంజలిఘటించవే
పువ్వా

గుడికివెళ్ళవే
పువ్వా
దేవునిసేవించవే
పువ్వా

చేతులుమారవే
పువ్వా
చెలిమినిపెంచవే
పువ్వా

రాలిపోయినా
పువ్వా
తిరిగిపూయవే
పువ్వా

వాడిపోయినా
పువ్వా
మళ్ళీవికసించవే
పువ్వా

మరలపూయవే
పువ్వా
మనసుదోచినా
పువ్వా

స్వాగితిస్తానే
పువ్వా
చెంతకుచేరవే
పువ్వా


కామెంట్‌లు