🔱మదమెక్కి విహరించు
చిత్త మత్తేభoనకు
శివపదం కలిగించు!
గౌరీపతీ! నీవే గతి!
( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🔱ఓ పరమశివా!అపరిచ్ఛిన్నానంద మూర్తీ! సర్వమంగళ దాయక! స్వామి! నా ఈ మాసస మదపుటేనుగు నిలుపుటకు వీలుపడని గమనముతో; నలువంకల పరుగులిడుచున్నది! దీనిని నీదు భక్తియను త్రాడుతో గట్టి, మెల్లగా బట్టుకొని, పునరావృత్తి రహితముగా; స్థిరమైన సాంబశివ పరంబ్రహ్మ పదము జేర్చుము!
⚜️ప్రార్థనా శ్లోకము
ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనఃకరీ గరీయాన్
పరిగృహ్య నయేన భక్తి రజ్జ్వా
పరమ! స్థాణుపదం దృఢం నయాముమ్!!
( శ్రీ శివానంద లహరి.. 97.వ. శ్లోకము)
🪷బంధింపబడిన నా మానస మదపుటేనుగును, స్థాణుపదము (శాశ్వతమగు, "శివపదము" ) నందు.. సుస్థిరముగా నుండు నటుల చేర్చుము! అని, ఆదిశంకరులు.. పరమ శివుని ప్రార్థించుచున్నారు.
🪷🔆🪷
🚩కంద పద్యము
మత్తిల్లి యిచ్చవచ్చిన
యెత్తున నెల్లెడ జరించునీ, నా చిత్తో
న్మత్త గజంబున్ జేర్పు, ము
దాత్తపు భక్తియను, మేటి స్థాణు పదంబున్!
( శ్రీబలిజేపల్లి లక్ష్మీకాంత కవి.,)
🪷🔆🪷
🚩తేటగీతి పద్యము
చిత్త మత్తేభ మియ్యది, మత్తులోన
విఱ్ఱవీగుచు, మానసవీధి తిరుగు,
బత్తి త్రాటిని బంధించి, పరమమైన
స్థాణు పదమును చేర్చుమో శంభునాథ!
(డా. శ్రీ పాదుక., కొల్లూరు అవతార శర్మ.,)
🕉 నమఃశివాయై నమఃశివాయ!
(శ్రీ శివ ఏకాదశాక్షర (11) తారక మహా మంత్రము)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి