శ్రీమాన్ శివ పరoబ్రహ్మ "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి:- 99127 67098
 🔱బ్రహ్మాది దేవతలకు
     పరిపాలకుడ వీవె!
     శ్రీమాన్ శివ పరoబ్రహ్మ!
     దేవదేవ! నమః శివ!
        ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
⚜️పరమశివుడే ... పశుపతి నాథుడు! అనగా... బ్రహ్మాది దేవతలకు ప్రభువు! జన్మ సంసారపాశ బంధముల నుండి విముక్తులను కావించు సామర్థ్యం కలవాడు! కనుక దేవదేవుడే.. సాంబ శివుడు!
🙏శంభోశివ! మహాదేవ! బ్రహ్మాదులగు ముప్పది మూడుకోట్ల దేవతలను.. స్తోత్రార్హులను లెక్కించు నప్పుడు; నిన్ను మొట్టమొదట వానిగా లెక్కపెట్టుచున్నారు! నీదు మాహాత్మ్యము అభివర్ణింప లేకున్నారు! ఎట్లనగా... ధాన్యపురాశి యెగురబట్టు నప్పుడు... పొట్టంతయు దూరముగా పోయి; సారమైన నిక్కమైన మంచి గట్టి ధాన్యము వలె; దేవత లందరిలో.. నిన్ను ఉత్తమోత్తమునిగా పేర్కొనుచున్నారు! 
        మహాదేవ! ఇవి.. వట్టి స్తోత్రపాఠములు కావు. నేను చెప్పినదంతయు యథార్థమే! ఇందులో... ఇసుమంతయు కూడా అసత్యము లేదు! ఇది.. సకల శ్రుతి స్మృతి ప్రసిద్ధమైనది! బ్రహ్మాది దేవతలందఱు.. మీ సేవకులే! అని, శంకర భగవత్పాదులు ప్రస్తుతించారు
🔱ప్రార్థనా శ్లోకము
     స్తోత్రేణాల మహం ప్రవచ్మి న మృషా, దేవా విరించాదయః 
    స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వా మగ్రగణ్యం విదుః!
    మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణ ధానాతుష స్తోమవత్ 
    ధూతా స్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో! భవత్సేవకాః!!
        ( శ్రీశివానంద లహరి..100వ శ్లోకము.,) 
       🙏శ్రీమాన్ శివ పరంబ్రహ్మ మొక్కడే స్తుతింపదగిన దైవము! ఆ స్వామివారికి.. సాటియైన దైవము లేనేలేడు! అని; నొక్కి వక్కాణించు చున్నారు! ఆదిశంకరులు ఈ విధంగా స్వస్తి వచనముతో.. గ్రంథ పరిసమాప్తిని కావించు చున్నారు!
               🔆🪷🔆
     🚩మత్తేభం పద్యము
     నిను స్తోత్రవ్యులలో గణింత్రు, మొనగానిం గా, విధాత్రాదు లె
     ల్ల నజాండాదిక సృష్టిలోనయిన లీలన్ వారు, నీముందు నెం 
    దునకున్ గారిక, నుత్తమోత్తమ ఫల స్తోమంబు; నీకంటె లే 
     దని నీభక్తజనం బెఱుంగు, నిజమీశా! యింకజాలు నుతుల్!!
         ( శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి.,)
                 🪷🔆🪷
        🚩 చంపక మాల పద్యము
    ధరనిది సత్యమైన నుతి, తథ్యము నూటికి నూఱు పాళ్ళహెూ! 
    సరిగనె యెంచిరందరు, విచారణ సల్పి, విరించి ముఖ్యులున్ 
     చెరగగ నెత్తిపోతలను, చీలియు పొల్లది పోవు పోలికన్
      దొరగను నిన్ను నెన్నిరిగ దొడ్డతనంబున నీకు భృత్యులై!
      ( డా. "శ్రీపాదుక" కొల్లూరు అవతార శర్మ.,)
🕉 నమః శివాయై! నమః శివాయ!
          (శ్రీ శివ ఏకాదశాక్షరీ (11), తారక మహామంత్రము.,)

కామెంట్‌లు