తెల్ల గౌను- నెనావత్ నందిని-బానోతు నీల-ఆరవ తరగతిZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-7286043955
 అనగనగా ఒక ఊరిలో శ్వేత, అనిత అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరు కలిసి బడికి వెళ్లేవారు. కలిసి ఆడుకునేవారు. అన్నింటా వారిద్దరూ ముందుగా ఉండేవారు. శ్వేతకు ధైర్యం ఎక్కువగా ఉండేది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళేది. కానీ అనిత మాత్రం చాలా భయపడుతూ ఉండేది.
                     వీరిద్దరూ ఒకరోజు సాయంత్రం చెరువు దగ్గరికి వెళ్లారు. ఇద్దరూ కలిసి చెరువు దగ్గర చాలాసేపు ఆడుకున్నారు. వాళ్లకు సమయం తెలవడం లేదు. మసక చీకటితో రాత్రి అయింది. అప్పుడు అనితకు చాలా భయం వేసింది. కానీ శ్వేత భయపడలేదు. అక్కడ వాళ్లకు వేళాడుతున్న ఒక తెల్ల గౌను కనిపించింది. దానిని చూసి అబ్బో తెల్ల భూతం వచ్చిందని అనిత గజగజ వణికిపోయింది. శ్వేతకు కూడా భయమైంది. కానీ శ్వేత ధైర్యంగా ఆ తెల్ల గౌను వద్దకు వెళ్లి, చేయితో ముట్టుకుంది. టక్కున తెల్లగౌను చెట్టు కొమ్మనుంచి కింద పడిపోయింది. అప్పుడు అనిత మనసు కుదుటపడింది. ఉదయం ఆరేసిన గౌను ఎవరో మర్చిపోయారని, గౌనుని తీసుకొని ఊర్లోకి వెళ్లారు. గౌను కోసం ఎదురుగా వస్తున్న వాళ్లు తెల్లగౌను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటినుంచి అనిత కూడా శ్వేతలాగా ధైర్యంగా ఉండసాగింది.
నీతి: ఎంతటి ఆపద వచ్చినా ధైర్యంగా ముందుకు కదలాలి.


కామెంట్‌లు