మాయాకుండ;- శ్రీనివాస్-ఆరవ తరగతి- ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-8096782088
 అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు కొంత పొలం ఉండేది. రామయ్య ప్రతిరోజు పొలం పనులకు వెళ్లేవాడు. ఒకరోజు పొలం వద్దకు అడవి నుండి వెళ్ళుతుండగా, ఒక కుండ దొరికింది. దానిని తీసుకువెళ్ళి పొలం దగ్గర పెట్టి, అడ్డంగా ఉన్న గులకరాయిని అందులో వేశాడు. అప్పుడు కుండనిండుగా గులకరాళ్ళు అయ్యాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఆ కుండను తీసుకువెళ్లి ఇంట్లో పెట్టాడు.
              కొత్త కుండను చూసిన భార్య సీతమ్మ అందులో కొద్దిగా బియ్యం వేసి, వంట చేసింది. అప్పుడు కుండ నిండుగా అన్నం అయింది. సీతమ్మ ఆశ్చర్యపోయి రామయ్యకు చెప్పగా, ఇది మాయకుండా అని గ్రహించారు. అప్పటినుంచి ఎవరికి ఏ అవసరం ఉన్నా మాయాకుండ ద్వారా ప్రజలకు సీతమ్మ భోజనం పెట్టేది.
          మాయాకుండ విషయం తెలుసుకున్నాడు జమిందార్ రత్నాలు. రామయ్య, సీతమ్మ లను బెదిరించి దౌర్జన్యంగా మాయకుండను తన ఇంటికి తీసుకవెళ్ళాడు. ప్రజలందరూ కూడా జమీందారుతో వెళ్లారు. జమీందారు మాయాకుండను తన ఇంట్లో ఉన్న కుండల మధ్య పెట్టాడు. అప్పుడే ఒక పిల్లి డబ్బున మాయకుండపై దూకింది. అప్పుడు మాయకుండా పగిలిపోయింది. అప్పుడే పక్కనున్న కుండలన్నీ పగిలిపోయాయి. పక్కనున్న కుండలు పగిలిపోవడంతో అందులో నుంచి బంగారు నాణాలు బయటపడ్డాయి. జమీందార్ రత్నాలు మమ్మల్ని మోసగించి బంగారు నాణేలు అంతా కూడబెట్టాడని, తలా కొంత నాణేలు తీసుకొని వెళ్లారు. జమీందారు రత్నాలు తాను చేసిన మోసానికి తగిన శిక్ష మాయాకుండ రూపంలో పడిందని మౌనంగా ఊరుకున్నాడు.
నీతి: మోసంతో సంపాదించిన ధనం తిరిగి ఏదో ఒక సమయంలో కోల్పోవడం జరుగుతుంది.


కామెంట్‌లు