నిజాయితీ - మాలోతు నిర్మల--ఎనిమిదవ తరగతి ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9010923616
 అనగనగా చంద్రగిరి అనే ఊరిలో లచ్చవ్వ అనే ముసలి అవ్వ ఉండేది. ఆమె చాలా కష్టపడి ఇంటి పనులతో పాటుగా కూలీ పనులు చేస్తూ ఉండేది. అలాగే తమ ఇంటి పక్కన ఉన్న వివిధ రకాల పండ్లను తెంపుకొని, పక్క గ్రామాలకు వెళ్లి అమ్ముకుంటూ జీవించేది. మంచిగా మాట్లాడే ముసలి అవ్వ దగ్గర అందరూ పండ్లు కొనుక్కునేవారు.
                   ఒకరోజు ముసలవ్వ పండ్లు అమ్మనికి పక్క గ్రామం వెళ్ళింది. ముసలమ్మ దగ్గర పండ్లుకొంటున్న వారి బంగారం ఎప్పుడో పండ్ల గంపలో పడింది. ఎవ్వరు గమనించలేదు. పూర్తిగా పండ్లు అమ్మిన ముసలవ్వకు బంగారం కనిపించింది. ముసలవ్వ బంగారం చూడగానే చాలా సంతోషపడింది. బాగా ఆలోచించి గ్రామంలోని పెద్దలను పిలిచి నా గంపలో ఎవరిదో బంగారం పడింది. దయచేసి వారికి ఇవ్వండి. ఎంతో కష్టపడితే గాని బంగారం కూడపెట్టలేరు అని ముసలవ్వ తన గ్రామం వెళ్లిపోయింది.
                    గ్రామ పెద్దలంతా బంగారం ముసలవ్వ వద్ద దొరికిందని ప్రజలకు తెలిపారు. పండ్లు కొట్టుంటే నా బంగారం పోయిందని ఏడుస్తూ ఒకరు వచ్చి వారి బంగారం తీసుకున్నారు. పొరుగు గ్రామమైన పండ్లు అమ్మనికి వచ్చిన ముసలవ్వ నిజాయితీగా బంగారం ఇచ్చినందుకు గ్రామస్తులు సంతోషించారు. ఎప్పుడు పండ్లు తెచ్చిన ముసలవ్వ దగ్గరే కొనుక్కునేవారు. అప్పటినుంచి ముసలివ్వని కాస్త నిజాయితీ ముసలివ్వ అని పిలుస్తూ ఉండేవారు.



కామెంట్‌లు