మంచి స్నేహితులు;- బత్తుల పూజ ఎనిమిదవ తరగతిZPHS హవేలీ ఘనపూర్మెదక్ జిల్లా9640430869

     అనగనగా రంగాపురం గ్రామంలో లత, గీత, రాజు, రాము, సీత నివసిస్తున్నారు.వీరంతా మంచి స్నేహితులు. ఒకరోజు లత వాళ్ళ అమ్మకు జ్వరం వచ్చింది. అప్పుడు లత చాలా ఏడ్చింది. లత వాళ్ళ అమ్మకు జ్వరం రావడం మూలంగా బడికి వెళ్లడం లేదు. ఓ రోజు సాయంత్రం అందరూ లత వాళ్ళ ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నారు. అమ్మకు వైద్యం చేపిద్దామంటే డబ్బులు లేవని, నాన్న అమ్మను పట్టించుకోవడంలేదని ఏడ్చింది. లత స్నేహితులందరూ బాధపడ్డారు.
                    మరుసటి రోజు లత స్నేహితులందరూ కూడా బడికి వెళ్లకుండా వారి వారి పొలంలో పని చేయసాగారు. ఆరోజు పని చేసినందుకు పనికి మూలంగా కూలి డబ్బులు వాళ్ల తల్లిదండ్రుల వద్ద తీసుకొని అన్ని డబ్బులు జమ చేశారు. మరుసటి రోజు లత వాళ్ళ తల్లికి స్నేహితులందరూ వైద్యం చేయించారు. రెండు రోజుల్లో లత వాళ్ళ అమ్మకు జ్వరం తగ్గింది. మామూలుగా అయిపోయింది. లత మరుసటి రోజు నుంచి బడికి రావడం చూసి స్నేహితులందరూ సంతోషించారు. స్నేహితులు కూలి పని చేసి తమ తల్లికి వైద్యం చేయించినందుకు లత వారికి కృతజ్ఞతలు తెలిపింది.

కామెంట్‌లు