వ్యాపారం;- కె.సహర్షిని-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9885668665

  అనగనగా లక్ష్మాపురం అనే ఊరిలో నరేష్ కవిత అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు సీత. సీతకు బాగా చదువుకోవాలని ఆశ ఉండేది. కానీ వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ఇబ్బందిగా ఉండడం మూలంగా చదువుకోలేదు. వాళ్ళు పని చేస్తేనే పూట గడుస్తుంది. తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కూతురు సీతతో పనిని చేపించేవాళ్లు. కానీ సీతకు చదువుకోవాలన్న ఆశ ఉంది అని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ఏం చేయాలో నరేష్ కవితలకు అర్థం కాలేదు. 
            వారు బాగా ఆలోచించి సీతకు చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే క్రిస్మస్ పండుగ వచ్చింది. దంపతులిద్దరూ బాగా ఆలోచించారు. కొద్దిపాటి డబ్బులతో పట్నం నుంచి బొమ్మలు తీసుకొచ్చి, చర్చి ముందు పెట్టి అమ్మినారు. చర్చికి వచ్చిన వారంతా కూడా నరేష్, కవితల వద్ద బొమ్మలు కొనుక్కొని వెళ్లారు. చాలా లాభం రావడంతో సీతను బడికి పంపాలని నిర్ణయించుకుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. వారు అలాగే చిన్న చిన్నగా వ్యాపారం కొనసాగిస్తూ డబ్బులు సంపాదించసాగారు. వాటితో సీతకు కావలసిన వస్తువులు కొనిచ్చి సంతోషించసాగారు. సీత కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు కీర్తి తెచ్చింది.
నీతి కష్టపడితేనే ముందుకు వెళతాం కష్టం లేకుండా బ్రతకలేము

కామెంట్‌లు