పట్టుదల;- యం. అక్షయ-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9885668665
   అనగనగా ఒక ఊరిలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవాళ్లు. వారికి రాకేష్ అనే కుమారుడు, రవళి అనే కుమార్తె ఉన్నారు. వాళ్ల కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. తండ్రి రామయ్య ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు. వారికి ఉన్న అర ఎకరం పొలంలో కేవలం లక్ష్మమ్మ మాత్రమే పనిచేసి, కుటుంబాన్ని పోషించేది. తల్లిదండ్రుల పరిస్థితి మూలంగా రాకేష్, రవళిలు సరిగా చదవడం లేదు. అలాగే రవళికి నృత్యం అంటే ఎంతో ఇష్టం ఉండేది. ప్రతి పాటకు కొత్త రకంగా నృత్యం చేస్తూ రవళి అందరినీ ఆకట్టుకునేది.
                ఒకసారి పాఠశాలలో జరిగిన నృత్య పోటీలలో పాల్గొన్న రవళి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రవళి నృత్యాన్ని పట్టుదల చూసిన డ్యాన్స్ మాస్టార్లు రవళికి నృత్యంలో మెలకువలు నేర్పిస్తారు. రవళి చదువుతూనే నృత్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నది. పదవ తరగతి పూర్తి చేసిన రవళి ఇంటి వద్దనే విద్యార్థులకు నృత్యం నేర్పిస్తూ డబ్బులు సంపాదించసాగింది. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించడమే కాకుండా, రాకేష్ ను చదివిస్తూ గొప్ప డాన్స్ మాస్టర్ గా రవళి పేరు తెచ్చుకుంది. మొదట్లో రవళి నృత్యం చేయడం తల్లి లక్ష్మమ్మకు నచ్చకపోయినా కష్టపడి అందులో ప్రావీణ్యం పొంది చిన్నారులకు నేర్పిస్తుండడం చూసి లక్ష్మమ్మ ఆనందపడింది. పదిమందికి ఉపయోగపడే నృత్యం అందిస్తున్నందుకు రవళికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
నీతి: చదువుతోపాటు వివిధ ప్రక్రియలలో పట్టు సాధించిన గొప్ప లక్షణం అవుతుంది

కామెంట్‌లు