నీతి-నిజాయితీ- బోయిని నిత్యలహరి-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9963502369
   తిమ్మాయిపల్లి అనే ఊరిలో చక్రపాణి అనే జమీందారు ఉండేవాడు. ఊరికి అతనే పెద్ద. ఊర్లో అతని మాటనే సాగేది. జమిందార్ చక్రపాణి చెప్పిందే వేదం అన్నట్లు ఉండేది. ఎవరైనా సరే జమిందార్ మాటను మీరే వారు కాదు. అదే ఊర్లో వీరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను అనాధ. అయినా నీతి, నిజాయితీతో బతికేవాడు. వీరయ్య ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన పని చేసుకుంటూ, వచ్చిన డబ్బుతో ఆహారం తింటూ మిగిలిన కొంత డబ్బు పేదవారికి ఇచ్చేవాడు. అతనికి నివాసం లేకపోవడంతో ఊరి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో పడుకునేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు.
                ఒకరోజు రాత్రి వీరయ్య అమ్మవారి గుడిలో పడుకున్నాడు. తెల్లవారి లేచి చూస్తే అమ్మవారికి బంగారు నగలు లేవు. విషయం తెలుసుకున్న జమిందార్ చక్రపాణి గ్రామస్తులందరినీ కచీరు దగ్గరికి పిలిపించాడు. రాత్రి నీవు ఎక్కడ పడుకున్నావని వీరయ్యను అడిగాడు. తాను గుడిలోనే పడుకున్నానని వీరయ్య చెప్పాడు. అది విన్న జమిందార్ చక్రపాణి దొంగతనం నీవే చేశావని వీరయ్యను ఊరి నుంచి బహిష్కరించాడు. వీరయ్య చేసేదిలేక ఏడుస్తూ అడవిలో నుంచి వెళ్ళిపోతున్నాడు. అడవిలో ఇద్దరు దొంగలు అమ్మవారి నగలతో కనిపించారు. వీరయ్య ధైర్యం చేసి దొంగలచే కలబడి, వారిని పట్టుకుని గ్రామంలోని కచీరు వద్దకు తీసుకు వచ్చాడు. 
             వీరయ్య పట్టుకొచ్చిన ఇద్దరు దొంగలు కూడా అమ్మవారి నగలు మేమే దొంగతనం చేశామన్నారు. కానీ ఆ దొంగతనం చేయమన్నది జమిందార్ వీరయ్య అని చెప్పారు. గ్రామస్తులందరూ జమీందారును కోపగించుకున్నారు. వీరయ్యకు వేసిన శిక్షను జమీందార్ చక్రపానికి వేసి, ఊరి నుంచి బహిష్కరించారు. వీరయ్య ఊర్లోనే ఉండసాగాడు. మంచి పనులు చేస్తూ, నీతి నిజాయితీతో ప్రజలకు సహాయం చేస్తున్న వీరయ్యను జమీందారుగా ఎన్నుకున్నారు. వీరయ్య కూడా ప్రజలకు సహాయం చేస్తూ, ఆనందంగా జీవించసాగాడు. 
నీతి :: మనం నీతి, నిజాయితీతో ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు.కామెంట్‌లు