అమ్మ- మాలోతు నికిత తొమ్మిదవ తరగతి ZPHS హవేలీ ఘనపూర్మెదక్ జిల్లా
 తీయ్యనైన అనురాగం అమ్మ
తొమ్మిది నెలలు మనల్ని మోసేది అమ్మ
మనం కడుపులో ఉన్నప్పుడు
కాళ్లతో కొడితే నవ్వుతుంది అమ్మ
తీయనైన పలకరింపు అమ్మ
మనకు మాటలు నేర్పేది అమ్మ
మనకు నడక నేర్పించేది అమ్మ
అమ్మ నవ్వుతే ఆనందంగా ఉంటుంది
అమ్మలేనిది లోకం లేదు
అమ్మను మించిన దైవం లేదు
అమ్మ ఉంటేనే స్వర్గం
అమ్మ లేకుంటే జీవితం శూన్యం

కామెంట్‌లు