నీ స్నేహం - ముడావత్ శిరీషతొమ్మిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా
  అనగనగా రాయగిరి అడవిలో జంతువులు నివసిస్తున్నాయి. ఒకరోజు అడవిలో చిరుత మరియు జింక తెలియకుండా ఎదురెదురయినాయి. చిరుతను చూసి జింక నన్ను చిరుత తినేస్తుందేమోనని భయపడింది. జింక భయాన్ని గమనించిన చిరుత మిత్రమా! నువ్వు భయపడకు నిన్ను నేను ఏమి చేయను అంది. జింక కొంత ధైర్యం తెచ్చుకుని, తెలియకుండానే పరిచయమైన జింక మరియు చిరుత ఇద్దరు కాసేపు ముచ్చట పెట్టుకుని తిరిగి ఎవరి దారిలో వాళ్లు వెళ్ళిపోయారు.
                   ఒకరోజు మళ్లీ అనుకోకుండా చిరుత, జింక ఎదురెదురు అవుతారు. అప్పుడు జింకతో మరో జింక ఉంటుంది. తనకు మిత్రుడే కదా చిరుత ఇక నన్నేం చేయడని జింక దగ్గరగా ఉండసాగింది. కానీ చిరుత ఆరోజు ఆకలితో ఉంది. ఇప్పుడు చిరుత దృష్టి మరోజింకపై పడింది.  తనతో వచ్చిన జింక వైపు చూడడం మిత్రుడైన జింకకు అనుమానం కలిగింది. 
              అప్పుడు జింక ధైర్యం చేసి మిత్రమా! నీ చూపు నాకు అర్థమైంది. నీకు ఆకలిగా ఉంటే నన్ను చంపి ఆకలి తీర్చుకో! కానీ నా స్నేహితుడిని చంపకు అని చిరుతను ప్రాధేయపడింది. అప్పుడు చిరుత తన మనసు మార్చుకుని, జింకలిద్దరిని వదిలిపెట్టింది. జింకలు చిరుతకు నమస్కరించి, వెళ్లిపోయాయి. అప్పటినుంచి చిరుత అడవిలో ఉన్న జింకలను మిత్రులుగా భావించి తినడం మానేసింది.
నీతి: స్నేహం విలువ తెలిసిన వాళ్ళు మనసున మార్పు తెచ్చుకుంటారు.

కామెంట్‌లు