ఆపదలో ఉన్న వారిని గమనించి సాయంజేసేవాడు మంచిమిత్రులు.అలాంటి కథ కొంగయైన నాడీజంఘుని మంచి తనం తెల్సుకుందాం.నిజమైనహితుడు ఆపదలో తాను ఉన్నా తన ప్రాణమిత్రునికి సాయం చేస్తాడు.కృష్ఢుడు తరతమభేదాలు ఎంచక కుచేలునికి సాయంజేశాడు.ద్రుపదుడు ద్రోణుని అవమానిస్తే సహించి శిఖండి కి విద్యనేర్పాడు.ఇక మహాభారతం లో ఓకథ ఉంది.ఒకమంచి కుటుంబం లో పుట్టినవాడు చెడుసావాసాలకు మరిగి మద్యం మాంసం వేట ల్లో దైవం ని గూర్చి మర్చాడు. భ్రష్ఠుడైనవాడిని చూసి నాడీజంఘుడనే కొంగ జాలిపడ్తుంది."మనిషి కి మంచిమిత్రులు వెండి బంగారం బుద్ధి తెలివి తేటలు వుంటే జీవితం మలుపు తిరుగుతుంది.నీవు సుఖపడే మార్గం చెప్తాను.మంచిమార్గంలో నడు" అని ఆవేటగానికి
చెప్తుంది
మధువ్రజం అనే పట్టణంలో విరూపాక్షుడు అనే రాక్షసుడు ఉత్తముడు.ఈవేటగాడికి కావాల్సినంత ధనం ఇచ్చి పంపాడు.కానీ వాడి మీద ఎందుకో అనుమానం వచ్చింది.వీడు కొంగ దగ్గరకు వెళ్ళి " నీస్నేహితుడు కావాల్సినంత ధనం ఇచ్చాడు" అని అంటాడు.కొంగ ఆనందంతో నిద్ర పోయింది.ఈదుష్టుడు ఆకలిబాధతో ఆకొంగని చంపి మాంసం మూటగట్టుకుని బైలుదేరాడు. రాక్షసునికి ఆదొంగమీద అనుమానం వచ్చి తన భటుల్ని పంపాడు.వారు వాడిని పట్టుకుని వస్తే రాక్షసులు కుక్కలతో సహా ఎవరూ ఆనీచుడ్ని చంపితింటానికి
ఇష్టపడలేదు.వాడిని స్థంభానికి కట్టేశారు.కొంగ శరీరభాగంకి దహనసంస్కారం చేసి " నామిత్రుడ్ని బ్రతికించమని విరూపాక్షుడు దేవతలని ప్రార్ధించటం
కొంగ సజీవరూపంతో బతికి ఆవేటగాడిని క్షమించడం
నిజంగా అపూర్వ ఘట్టం.తనప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన కొంగ దాని మిత్రుడు రాక్షసుడు విరూపాక్షుడు ఆదర్శం.కానీ మిత్రుల ఎన్నికలో జాగ్రత్తలు తీసుకోవాలి సుమా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి