అబుధాబిలో అంగరంగ వైభవంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర ఆత్మీయ సమ్మేళనం
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబినగరంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ - అబుధాబి అధ్యక్షులు గంధం రమేష్ బాబు, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ విష్ణు ఇప్పిలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియన్ అంబాసిడర్ సంజయ్ సుధీర్ మాట్లాడుతూ చిగురుమళ్ళ 100 పుస్తకాలు రచించి 100 దేశాలలో శాంతి యాత్ర నిర్వహిస్తూ, మానవాళి ని చైతన్య పరచరడం అభినందనీయం అన్నారు.
TAAD అధ్యక్షులు  మాట్లాడుతూ 
ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి  శ్రీనివాస్ గారు "వందే విశ్వమాతరమ్" పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు. చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ 
జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది. నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో భాగంగా మధ్య ప్రాచ్య  దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము. మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా  సాధ్యమవుతుందని అన్నారు.మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.ఆత్మీయ సమ్మేళనంలో  భాస్కర్ గుప్త, హరికృష్ణ, వెంకీ, నారాయణKDVS, కృష్ణ కిషోర్, ధనంజయ్,రవి, శ్రవన్ రెడ్డి తో పాటు వందలాది మంది తెలుగు వారు పాల్గొన్నారు.

కామెంట్‌లు