అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నాలుగు వందల సంవత్సరాలు గడిచిన మండపం శిథిలమైందే కానీ జనహితం కోసం చేపట్టిన ఆ మహానుభావుడు అభిమతం అభినందించండి అని అనిపించింది  రెడ్డి గారికి అప్పుడు నరసింహులు గారు కల్పించుకొని ఇక్కడ ఆదమరిచిన నిదిరించే భక్తుల సొత్తును కాజేయడానికి కొందరు దొంగలు కూడా భక్తుల వేషాల్లో వచ్చి అదను చూసి కాజేసి ఉడాయించే వారని అందుకని ఆ మండపానికి దొంగల మండపం అనే పేరు వచ్చిందని చెప్పారు. స్థానికులంతా కలిసి హరికృష్ణ గారిని బ్రతిమలాడారు ఆ మండపాన్ని బాగు చేయమని అందుకు తన సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు మళ్లీ రెడ్డిగారు రమణగారు తుడా ఇంజనీర్లు కలిసి కొలతలు ఫోటోలు తీసుకొని కారెక్కి తిరుపతి అన్నమాచార్య కళా మండపం దగ్గరికి వెళ్లారు  రెడ్డి గారికి బాగా ఇష్టమైన దోషాలు వడకరి కుష్కి ఇడ్లీ తిన్నారు  వారికి మళ్ళీ 1973-77 తిరుపతి శిల్పకళాశాల జీవితం గుర్తొచ్చింది. ఇడ్లీ సెలయేటి ధారలాంటి చెట్ని మందంగా ఉన్న ఉల్లిపాయ సాంబారు ఎర్ర కారంపొడి తింటుంటే మధ్యలో వచ్చి పడుతున్న చిట్టి గారెలు  నాస్తా అలా ఇష్టంగా ముగిసింది. చంద్రగిరి ఇదే చంద్రగిరి శౌర్యానికి గీసిన గిరిజన పాట గుర్తుకొచ్చింది రెడ్డి గారికి ఇమ్మడి నరసింహారాయుడు గుర్తొచ్చారు చిన్నప్పుడు అక్కడ పలక బలపం పట్టుకుని బడికి వెళ్ళిన బుల్లి కృష్ణదేవరాయులు గారు కూడా గుర్తొచ్చారు రమణ గారు చంద్రగిరి మీద రాసిన విషయాలు గుర్తొచ్చి రెడ్డి గారిని గిరిగింతలు పెట్టాయి  1975లో రెడ్డి గారు శిల్ప కళాశాల లో చదివేటప్పుడు ఎస్వీ సంగీతం రిచ్ఛ కళాశాలలో హరికథ ఇచ్చెను నేర్చుకుంటున్న భట్టాచార్య  అక్కడి విద్యార్థులందరికీ చంద్రగిరికి విహారయాత్రకు తీసుకెళ్లి ఇదే చంద్రగిరి శౌర్యానికి గీసిన గిరి అంటూ పడుతూ కోట గోడల నుంచి లోతైన కందకాలు ఆలయాలు శిల్పాల గురించి  వారికి ఆసక్తికరంగా వ్యవహరించిన చారిత్రక సంఘటనలు కట్టడాల కౌశలం శిల్పకళా వైభవం కళ్ళ ముందు కదిలాడై రెడ్డి గారికి  భట్టాచార్య గారు ఎవరో కాదు అన్నమయ్య శ్రీరామరాజ్యం సినిమాలకు8 మాటలు కొన్ని పాటలు  రాసిన జెకె భారవి ఆయన ఒక చక్కటి కళాకారుడు సంగీతజ్ఞుడు మిమిక్రీ కళాకారుడు  హాస్య రసపూర్వక ప్రసంగాలు చేయడంలో దిట్ట  పంతువరాలి రాగంలో  దినకర శుభకర కీర్తనలు జిలకర మెంతులు అంటూ అప్పడికప్పుడు ప్యారడీ చెప్పిన ఆశకవి చంద్రగిరిలో శౌర్య గిరిలో కాలు మోపాడు రెడ్డి గారు  హరికృష్ణ గారు రాజమహల్ దాటిన తర్వాత దిగుడుబావికి ఎగువన గల ప్రదేశాలు చూపించారు సందర్శకుల కోసం ఒక ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పి కొన్ని చారిత్రక సంఘటన నేపథ్యాన్ని కల్పించవచ్చా అని అడిగారు.కామెంట్‌లు