అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దానితోపాటు పక్క ఊరు గుడివాడలోని కాకతీయుల కాలపు శివాలయాన్ని కూడా ఊడదీసి మళ్ళీ కట్టారు రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాలలో చుట్టుప్రక్కల ఊర్లవాడు ఎంతో మంది వచ్చి  పాలెం ఆలయ పునర్నిర్మాణ పనులను చూసి పోతూ ఉండేవాడు  ఆ క్రమంలోనే నోములు గ్రామంలో పూర్తిగా శీఘ్రమైన నర్సింహాలయాన్ని కూడా బాగు చేయాలని కళ్యాణ్ కుమార్ గారు 2011లో రెడ్డి గారిని అక్కడికి తీసుకెళ్లారు నిధులు చాలక ఆ పని ఆగిపోయింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత కళ్యాణ్ కుమార్ గారు, చిక్కు శ్రీనివాస్ గారు, విక్రమ్ రెడ్డి గారు ఆ ఆలయాన్ని ఊడదీసి మళ్ళీ కట్టాలి ఒకసారి నోములకు వస్తారా అని  పిలవడమే ఆలస్యం రెడ్డి గారు హైదరాబాదులో బయలుదేరారు. చిట్యాల నార్కట్పల్లి దాటి వివేక హోటల్ లో టిఫిన్ కోసం ఆగారు రెడ్డిగారు సంచిలోని నల్లగొండ జిల్లా శాసనాలు మొదటి సంపుతాను తిరగేస్తున్న వారికి చిట్యాల శాసనం కనిపించింది అది క్రీ.శకం 1253 నాటి కాకతీయ గణపతి దేవుని  గజ సైన్యాధ్యక్షుడు బ్రహ్మ రాక్షసగంగ నిర్వహించిన శాసనం ఆ శాసనాన్ని చూడాలనిపించింది రెడ్డి గారికి  అల్పాహారం ముగించుకొని  ఆయన శిష్యుడైన ఆ హోటల్ జి ఎం ప్రసన్న గారు కలిసి చిట్యాల సాక్షి విలేఖరి వేణు గారికి ఫోన్ చేసి ఆ శాసనం ఆచూకీ అడిగారు వేణు ఆ శాసనం ఉరుమల్ల దారిలో ఎంపీడీవో ఆఫీసు ప్రక్కదారిలోని ముత్యాలమ్మ గుడి దగ్గర ఉండేదని దాన్ని చిట్యాల మునిసిపల్ ఆఫీస్ దగ్గరకు చేర్చారని చెప్పాడు రెడ్డి గారు బయలుదేరి ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లారు అన్నీ ముళ్ళ చెట్లు పొదలు అడవిలా పెరిగివుంది కారు ఎక్కి అటు ఇటు చూసేసరికి రైలు కట్ట ప్రక్కన గుబురుచెట్ల కింద ఇద్దరు యువకులు మద్యం మత్తులో మాట్లాడుకోవడం వినిపించింది వారి దగ్గరకి వెళ్లి ఇక్కడ ఒక పాడుబడిన దేవాలయం ఉండాలి ఎక్కడా అని అడిగారు రెడ్డిగారు.


కామెంట్‌లు