అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు 6302811961.
 ఒకతను వచ్చి కంప చెట్లలో దాక్కుని ఉన్న కాకతీయ ఆలయ మండప స్తంభాలు  చూపించాడు. రెడ్డిగారు వారి డ్రైవర్ ఎలాగో ముళ్ళ కంపల్ని తొలగించుకుంటూ వెళ్లి మండపం దగ్గరకు  ప్రవేశించారు మాకు విఠలాచార్య సినిమా గుర్తుకొచ్చింది పిచ్చి చెట్లు చమల్ని తొలగించగా ఒక పీఠం దానిపైన నెమలి బొమ్మ పక్కనే విరిగిన వేణుగోపాల కార్తికేయ  నంది బొమ్మలు ప్రభా మండల శకలం కనిపించాయి. రెడ్డి గారికి నవ నిధులు దొరికినంత ఆనందం  కలిగింది. అపురూప శిల్ప కళతో ఉట్టిపడుతున్న ఆ శిల్పాలు కాకతీయుల కాలనివి. చుట్టుప్రక్కల శుభ్రం చేశారు  శిల్పాలు మరింత బాగా కనిపించాయి వారి కళ్ళలో కాంతులు విరజిమ్మాయి. ఫోటోలు తీసుకొని చిట్యాలకు వచ్చారు.
సాక్షి విలేఖరి వేణు కనిపించి మునిసిపల్ ఆఫీస్ వెనుక ఆ శాసనాన్ని చూపించాడు ఒక షాపు పక్కనే నీల కులానికి అనుకొని ఉంది 768 నాటి శాసనం  నల్ల శాలపురాతి పై కాకతీయుల కాలం పట్టణాలు ఉజ్జికగా పెళ్లికూతురుల  ముచ్చటగా ఇమిడి ఉన్నాయి. తడిమి చూసారు రెడ్డి గారు చదివి  మురిసారు. ఆ శాసనంలో గంగయ్య గజ సాహిని ముత్తాతల పేర్లు ఉన్నాయి  తాత ధనురుడు బౌద్ధుడని అతని కొడుకు ధనువుడు చిట్యాల పాలుకుడని గుజరాత్లోని ద్వారకా నగరాన్ని పాలిస్తున్న శ్రీకృష్ణునికి చిట్టాలు అనే గ్రామాన్ని దానం చేసిన సంగతి నమోదు చేయబడింది. వారితో పాటు ఉన్న దాస్యం వెంకట సురేందర్ ఆ శాసనాన్ని పైకి లేపి మునిసిపల్  కార్యాలయంలో ఒక పీఠంపై నిలబెట్టి ఆశాసనాల వివరాలను ఒక శిలాఫలకంపై ఇప్పటి అక్షరాల్లో పెట్టడానికి అయ్యే ఖర్చును భరిస్తాను అన్నాడు  ఆ పని చేయాల్సిన పురావస్తు శాఖ గుర్తొచ్చింది  రెడ్డి గారికి. తనను తానే సర్ది చెప్పుకొని నోముల గ్రామానికి బయలుదేరారు. నోముల చేరగానే ఆ ఆలయ కార్యకర్తలు చిక్కు శ్రీనివాస్ గుర్రం శివశంకర్ రెడ్డి పెద్దలు రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించారు ఆలయం ప్రక్కనే ఉన్న పడిపోయి ఉన్న విగ్రహాన్ని పై కలిపారు ఆశ్చర్యం ఒకే విగ్రహం ముగ్గురు మూర్తులు ఒకే శరీరం మూడు తలలు నాలుగు చేతుల్లో శూలం, శంఖం, స్రుక్ అక్షమాలలను ధరించి నిలబడి ఉన్న ఆ విగ్రహం అరుదైన త్రిమూర్తి విగ్రహం  ఇంతవరకు తెలంగాణలో బయలు పడిన తొలి త్రిమూర్తి విగ్రహం భిన్న మతాల మధ్య వైవిధ్యాలను తొలగించడానికి  హరిహరాధనను ప్రోత్సహించిన కాకతీయ గణపతి దేవుని కాలంలో బ్రాహ్మణులు కూడా చేర్చడం గమనించవలసిన విషయం  మట్టి కొట్టుకున్న ఆ త్రిమూర్తి విగ్రహాన్ని నీళ్ళలో కడిగి శుభ్రం చేశాడు రెడ్డి గారు.



కామెంట్‌లు