అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అనుకున్నట్లుగా చిట్యాల దాటిన 5 కిలోమీటర్ల తర్వాత హైవే పైన పెద్ద కాపర్తి బోర్డు కనిపించింది 10 ఏళ్ల క్రితం జాతీయ రహదారిని విస్తరిస్తుండగా ఒక కాకతీయ ఆలయం నెత్తి మీద నుంచి కొత్త రోడ్డు వేస్తుండగా  రెడ్డిగారు చూసి బాధపడిన సంగతి గుర్తొచ్చింది తర్వాత రహదారిన మరింత విస్తరించినప్పుడు ఆ ఆలయని ఊడదీసి దేవాలయ శాఖకు నష్టపరిహారం కూడా  ఇచ్చాడని తెలిసింది ప్రభుత్వం కదా తీరిక దొరక్క ఆలయ విడిభాగాలను అలానే గాలికి వదిలేశారు కానీ ముందు మండపం దూరంగా ఉండటం బ్రతికిపోయింది కప్పు జారిపడి చుట్టూ ముళ్ళకంప చెట్లు పెరిగి పోలీస్ కు భయపడి దాక్కున్న దొంగల దిక్కుబిక్కుమంటూ కల్పించింది  రెడ్డి గారితో పాటు వచ్చిన సోమశిల ఎల్లయ్య కంపను ప్రక్కకు  జరుపుతూ పోగా రెడ్డి గారు దాస్యం వెంకట సురేందర్ గారు ఆ మండపం దగ్గరికి వెళ్లారు.
ఒకప్పుడు ఊడదీసిన శివాలయంలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలకు వైభవోపేతంగా జరిగిన కళ్యాణోత్సవానికి వేదికగా హారతుల అందుకున్న ఆ కళ్యాణ మండపం స్మశానంలో కప్పులేని కాటి కాపరి గూటిలా తోచింది. కాలధర్మం ఇలా ఉంటుంది అనుకుంటూ రాతి దూలాలను, స్తంభాలను ఒక్కసారి  పోషించి సహనం నశించి వెనక్కి మళ్ళీ బాధతో  వచ్చి కార్ ఎక్కారు. రెడ్డి గారు చిన్న కాపర్తి దాటి బోయగుబ్బ గ్రామానికి వెళ్లారు ఊరి చివర పొలాల్లో నిర్లక్ష్యానికి నిలువు పెద్దల నైరాశ్యం పోగు పోసుకున్న ఒక శివాలయం మండపాలను చూసి చలించి పోయారు. శివాలయం మహా మండపం ఆనవాళ్లు కోల్పోయింది శివుని ముందు ఉండవలసిన నంది తావు తప్పింది పొలాల్లో ఆలయం మండపం ఆలనా పాలనా లేక గబ్బిలాలకు నెలవై ఇలా ఉండే కంటే శత్రుము కల చేతుల్లో విధ్వంసమైన భావం  బాగుండేదేమో అని మౌనంగా రోదిస్తున్నాయి చూడడానికి వచ్చిన  రెడ్డిగారి లాంటి వారిని బాధిస్తున్నాయి జీర్ణోద్ధరణ  కోసం ఎదురుచూస్తున్నాయి వారసత్వం వరస తప్పడం పట్ల ముక్కు మీద వేలు వేసుకుంటున్నాయి  ఆ యాత్ర  బాధతోనే ముగిసింది  ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి  బాధ్యత రాహిత్యం అనిపిస్తుంది  జీతాల కోసమే పని చేయడం తప్ప  పనిలో జీవించి  జీవితంలో తృప్తి పొందాలి అన్న ఆలోచన చాలా మందికి  ఉండదేమో అనిపించింది శివ నాగిరెడ్డి గారికి.


కామెంట్‌లు