అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961
 13 యాత్రలను పూర్తి చేసి 14వ యాత్ర ప్రారంభానికి  తన మిత్రులతో కలిసి బయలుదేరారు శివనాగి రెడ్డి గారు  అలనాటి బౌద్ధ వారసత్వ వరవడిలో ఈ తరానికి ఆ తరం విలువలు అందించడానికి  అప్పటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి   సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంజనేయ రెడ్డి గారు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నాగార్జునసాగర్ 274 ఎకరాల్లో చేపట్టిన  బద్దవరం ప్రాజెక్టు దేశంలోనే ఒక విలక్షణ బౌద్ధ పర్యాటక ఆకర్షణ క్రీస్తు శకం మూడో శతాబ్దిలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన శ్రీ పర్వత విజయపురి బౌద్ధ వైదిక మతాల సామరస్య వేదిక గానే కాక ఇక్ష్వాకుల రాజధాని కూడా బుధవరం ప్రాజెక్టుకు ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య ను  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా  నియమించి  నిధులను కూడా విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు  బౌద్ధ విషయ నిపుణ సంప్రదింపుదారిగా 3021 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రెడ్డి గారిని నియమించిన తర్వాత  రెడ్డిగారు తరచూ బుధవరం ప్రాజెక్టు సందర్శిస్తూ ఉండేవారు. నాగార్జునసాగర్ కృష్ణా నది ఎడమ గట్టున తెలంగాణ వైపున గల ఆత్మ మానవుని అడుగుజాడలను తరిమి చూడాలని ఎన్నోసార్లు  అనుకుంటూ ఉండేవారు రెడ్డి గారు అది ఇప్పటికీ కార్యరూపందాల్చింది  తెలుగువారి తొలి తరం చరిత్రకు తెలంగాణ పురిటి గడ్డ తొలుత కొండ గుహల్లో ఆ తర్వాత కొండచెర్ల కింద అటు తర్వాత గుంట ఆవాసాల్లో జీవించి మైదానాల్లో స్థిరపడిన ఆది మానవుడు ఆలవాళ్లు తెలంగాణలో కోకొల్లలు.
సరిగ్గా 100 సంవత్సరాల క్రిందట నాగార్జునుని కోటకు సమీపంలో పురాతన స్థలాన్ని గుర్తించడంతో ప్రారంభమైన చారిత్రక అన్వేషణ తెలంగాణ చరిత్రకు గవాక్షమయింది ఇప్పటి నాగార్జునసాగర్ వెనుక గల నీటిముంపు ప్రాంతంలో 1926 తర్వాత అనేక దఫలుగా పాత రాతియుగం మధ్య  సూక్ష్మ రాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం చారిత్రక తొలి శాతవాహనకు, ఇక్ష్వాకు) సంబంధించిన అవశేషాలు వెలుగు చూసినాయి 1954 నుంచి  1960 వరకు నాగార్జునకొండ వద్ద కేంద్ర పురావస్తు సంస్థ గడిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల రాజధాని శ్రీ పర్వత విజయపురి అనే  కోట గోడలతో ఉన్న నగరం బౌద్ధ వైదిక కట్టడాలు శిల్పాలు శాసనాలు వాటితో పాటు ఆదిమ మానవుని రాతి గొడ్డళ్లు, సన్నని బ్లెడ్లు ఇనుప పనుముట్లు బయలుపడి తెలుగు వారి చరిత్రపై వెలుగులు విరజిమ్మాయి.

.

కామెంట్‌లు