అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961
 కృష్ణానదికి ఆ వైపు శ్రీ పర్వత విజయపురి ఈ వైపు ఏలేశ్వరం పరిసరాల్లో లభించిన అనేక చారిత్రక ఆధారాలు ఆదిమ మానవుని జీవన వికాస క్రమంలో వివిధ మలుపులను తెలియజేస్తున్నాయి ప్రకృతి బీభత్సాలు క్రూర జంతువుల బారి నుంచి తనకు తాను కాపాడుకోవడానికి ఎత్తైన కొండ గుహలు చర్యలు కింద నివసించి ఆహార సంపాదన నీటి కోసం కృష్ణా నది తీరాన సంచరించి కాలమేలబుచ్చాడు క్రీస్తుపూర్వం 2.67 నుంచి క్రీస్తుపూర్వం 12500 సంవత్సరాల మధ్యకాలం  (పాత రాతి యుగం)లో చుట్టుప్రక్కల దొరికిన రాతితో పెచ్చులూడిదీసి రాతికుండదుగా మలుచుకుని దాన్ని ఒక ఆయుధంగా పరికరంగాలుపొందించి ఆహారాన్ని సంపాదించాడు  ఆ తర్వాత క్రీస్తుపూర్వం 12,500 నుంచి క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల వరకు రాఖీ పనిముట్ల తయారీతో వచ్చిన రాతి పెచ్చులు, సన్నటి బ్రిడ్లతో మాంసం కాయలు పండ్లను తినే యోగ్యంగా చేసుకున్నాడు. ఈ సన్న చిన్న పనిముట్లను సూక్ష్మరాకి పనిముట్లు అంటారు  సాగర పరిసరాల్లో తెలంగాణ వైపు పాత రాతి సుష్మ రాతియుగపు  పనిముట్లు కోకోలడుగా దొరికినాయి ఆ తర్వాత దశలో మరింత గట్టిరాళ్ళతో పనిముట్లను తయారు చేసి వాటిని బాగా అరగదీసి కోణాలు ఏడేటట్లుగా చేసి సులువుగా ఆహార సంపద చేశారు అంతే కాదు వ్యవసాయాన్ని విస్తృతంగా  పశువులను మచ్చిక చేసుకున్నాడు స్థిర నివాసం ఏర్పరచుకొని తమలాంటి వాడితో సంబంధాలు కొనసాగించిన కాలాన్ని కొత్త రాతియుగం అంటారు క్రీస్తు పూర్వం (4000 నుంచి 1750)  సంవత్సరాల ప్రాంతంలో కొత్త రాతి యొక్క బొడ్డు ఒడిశాల రాళ్లు సాన రాళ్లు అరగదీసుకున్న గుంటలోన అనేక స్థావరాలు బయటపడినాయి. కొత్త రాతియుగపు చివరి కాలంలో రాజీ అన్నయ్య లోహంతో పనిముట్లు తయారై కొత్త జీవన విధానానికి తెరపిసింది క్రీస్తుపూర్వం 1750 నుంచి క్రీస్తుపూర్వం 500 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా దొరికే ముడి ఇనుప చిట్టెపురాళ్లు విరివిగా ఉండడం వల్ల  నాటి మానవుడు వాటిని కరిగించి కావలసిన పరికరాలను తయారు చేసుకొని అడవులను నరికి కొత్తగా భూమిని సాగు చేసి తాత్కాలిక నివాసాల్లో ఉంటూ చనిపోయిన వారికోసం శవాలను గుంటల్లో పూడ్చి వారు వాడిన పనిముట్లను కూడా అక్కడే ఉంచి చుట్టూ రాతి పలకలతో ఒక చిన్న కొండను ఏర్పరిచి పైన భద్రంగా ఒక బండ నుంచి మట్టితో కత్తి ఎత్తైన దిబ్బగా తయారుచేసి పెద్దపెద్ద గుండ్లు బండ రాళ్ళను గుండ్రంగా అమర్చి శాశ్వత కట్టడ నిర్మాణానికి పలికాడు  మానవజాతి చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఇనుప యుగపు ఆనవాళ్లు నాగార్జునసాగర్ పరిసరాల్లో లెక్కలేనన్ని బయట పడినాయి.


కామెంట్‌లు