అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చంద్రగిరి కోటకట్టడాలు కేంద్ర పురావస్తు శాఖ వారి రక్షణలో ఉన్నాయి ఉద్యానవనం తప్ప కొత్త వాటిని చేర్చడానికి వీలులేదని డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేయవచ్చని శిథిల దర్బార్ హాలు చేదబావి రోడ్డుకు ఆవరణలో శిథిలాల పునరుద్ధరణ తెనాలి రామలింగని మట్టింటిని అనుమతి మేరకు బాగు చేయడం సందర్శకులకు వసతులు సౌకర్యాలు  స్థానిక జానపద కళారూపాలు హస్త కళాఖండాల ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చని సూచించారు రెడ్డి గారు వారికి తెలియని అనేక ఆసక్తికర చంద్ర గిరి సంగతులు చెబుతూ ఉంటే విజయనగర కాలంలో విహరించిన అనుభూతి కలిగింది మిగిలిన  బృందానికి ఇక రెడ్డి గారి ప్రయాణం శ్రీనివాస మంగాపురం వైపు ఆలయం నుంచి కాలినడకకు వెళ్లే దారిలో రోడ్డు ప్రక్కన ఒక దాని మీద మరొకటి పడి ఉన్న క్రీస్తు శకం 16వ శతాబ్ది స్తంభాలు దూలాలు, కప్పు నేలరాల్లు చరిత్ర పైన ఇంత నిర్లక్ష్యమా అనిపించింది. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉందని వెంటనే వేరే చోట నిర్మిస్తామని చెప్పి 15 సంవత్సరాల క్రితం ఒక చక్కటి మండపాన్ని ఊడదీసి అక్కడ పడే సారే తప్ప మళ్ళీ కట్టాలని ఆలోచన ఇప్పటికీ లేకపోవడం విడ్డూరం ఎవరిని నిందిస్తాం వదిలేద్దాం రెడ్డి గారి విషయం కాలినడక మెట్ల దారి అసలు స్వస్వరూపం కోల్పోయి కొత్త కట్టడాలతో వారసత్వం నిస్సత్తువుగా మారింది తిరుగు ప్రయాణంలో చలివేంద్ర మండలం  ఆంజనేయ ఆలయం మరో మండపం దగ్గర దిగి స్తంభాలపైన చెక్కిన దేవతా మూర్తులు ఋషి పుంగవులు కురువ గొల్లలు వేటగాడు వేటరాయుడైన నరసింహస్వామి విగ్రహాలను స్పృశించి అలనాటి శిల్పులతో మాట్లాడిన అనుభూతిని పొందారు రెడ్డి గారు పాత కట్టడాలకు కొత్త సొబగులలో ఉన్న శ్రద్ధ ఉన్నవాటిని ఉన్నట్లుగా బాగు చేయడంలో ఎందుకు లేదా అని తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులపై కొంచెం కోపం వచ్చింది కూడా వారు ఒక శిల్ప కళాశాలను నడుపుతున్నారు శిల్ప విభాగం ఉంది లేనిదల్లా ఆలోచన ఒక్కటే. రమణ గారు ఇదే స్వర్ణ ముఖి నది అని చెప్పారు కాజ్వే నుంచి చూశారు రెడ్డి గారు ఒకవైపు దేవతలు దీవి నుంచి  భువికి దిగివచ్చి స్నానాలు ఆచరించి  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకు నేవారని స్వర్ణముఖీ నది ఇంతటి పవిత్ర తీర్థమని విన్నారు రెడ్డి గారు నేడు సర్కార్ కంపతో నిండి ఇసుకాసురులకు బలై నిలువెల్లా కంతలతో వెతలు వెళ్లగక్కుతుంది  దాదాపు పది కిలోమీటర్ల దూరంలో సాఫీగా సాగిన వారి ప్రయాణం ఊపు తగ్గింది రమణ గారు రోడ్డు మలపమన్నారు మట్టి డొంక చక్కటి మామిడి తోటలు పచ్చటి వరి పైరులతో సిరులోలక బొస్తున్న పల్లెలు దాటుకుంటూ వెళ్లిపోయాడు రెడ్డి గారు వారు చూడాలనుకున్న తాటి కోన రానే వచ్చింది  కారును ఒకచోట ఆపి కాలిబాటను పట్టారు ఉరకలు పెడుతున్న సెల ఏరు మోకాళ్ళకు పైనే లోతు బట్టలు ఎగబట్టుకొని సెలయేటిని దాటారు. ఏట వాలు  వడ్డెరలు ఊరికే ఉండకుండా ఆ కొండపై పొరను కంకర కొట్టడంతో నడకదారి మాయమై జారుకుంటూ పైకి చేరుకున్నారు రెడ్డి గారు.


కామెంట్‌లు