అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 హేమావతిలో కేంద్ర పురావస్తు శాఖ పరిరక్షణలోనున్న దొడ్డేశ్వర సిద్దేశ్వర మల్లేశ్వర విరుపాక్షేశ్వర అక్కచెల్లెళ్ళు గుడులు ముఖ్యమైనవి ఈ ఆలయాలు అటు పల్లవ ఇటు చోళ వాస్తు మిశ్రమ శైలిలో నిర్మించబడినది గోడల పైన కిటికీలోని శిల్పాలు, స్తంభాలు ద్వారాబంధాలు కప్పు దూలాల పైన గల శిల్పాలు ఇంకా అక్కడి పురావస్తు మ్యూజియం వద్ద శిల్పాలు నోలంబ పల్లవ శిల్పుల పనితనానికి మచ్చుతునకలు ఏ ఆలయానికి ఆలయం ప్రత్యేకము శివుడు మానవ రూపంలో సిద్దేశ్వరునిగా సుఖాసనంలో కూర్చుని ఉండడం మన దేశంలోనే అరుదైన శిల్పంగా మరింత ప్రత్యేకతను సంతరించుకుని ఉంది  హేమావతి ఆలయాల ముందు పార్కులో ప్రవేశించగానే నోలంబ శైలికి పరాకాష్టగా ఉన్న నంది శివలింగాలు శిలాశాసన స్తంభం ఒకప్పుడు వైభవోపేతంగా ఊరేగిన కొయ్య రథపు చక్రం రామ రావణ యుద్ధం అష్టదిక్పాలకు
తీగెలు లతలతో అద్భుతంగా చెక్కిన స్తంభం మరో నంది మ్యూజియం బయట చండీ చాముండి ఆలయ విడిపోగాలు సప్తమాతలు నాలుగు కాళ్ల మండపాలను చూసి దుర్గేశ్వర ఆలయంలో ప్రవేశించిన రెడ్డి గారికి ఆ శిల్పాలను చూసి మతిపోయింది ఎదురుగా మండపంలో ఉన్నది లోపలి ద్వారాలు మహా మండప స్తంభాల పైన చెక్కిన సూక్ష్మ శిల్పాలు రెడ్డి గారికి మాట రాకుండా చేసిన ఆలయం బయటకు వచ్చి అన్ని ఆలయాలను మండపాలను చూసి ఒకసారి నోలంబ పల్లవ  మహేంద్రుని తలచుకొని ఆనాటి శిల్పులకు మొక్కారు రెడ్డి గారు. ఇంతటి అద్భుత వాస్తు శిల్ప వైభవం ఆలయాల గురించి ఇది ఒకప్పటి కన్నడ ఆంధ్ర రాజధాని అని చాలా మందికి చెప్పవలసిన బాధ్యత తనపై ఉన్నది అనిపించింది రెడ్డి గారికి రెడ్డి గారు మొబైల్ లో తీసుకోగలిగినన్ని ఫోటోలు తీసుకొని ఆలయంలో ఒక చోట కూర్చున్నారు ఎప్పుడో సి శివ రామమూర్తిగారు మద్రాసులో నోలంబుల శిల్పాల పైన రాసిన పుస్తకం మైసూర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కృష్ణమూర్తి నోలంబుల మీద రాసిన పుస్తకం బి రాజేంద్రప్రసాద్ గారు రాసిన ఆర్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లోని నోలంబుల శిల్పకళ పైన ఉన్న అధ్యాయం కళ్ళ ముందు  కదలాడై రెడ్డి గారికి
ఇంతలో రఘువీరా రెడ్డి గారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రెడ్డి గారిని వెయ్యి ఏళ్ల కాళ్లనాలి కలలో నుంచి బయట పడేసింది మళ్ళీ కారు ఎక్కారు  రెడ్డి గారి వయసు 67 సంవత్సరాలు ఇన్నాళ్ళు హేమావతి దేవాలయాలు శిల్పాలను చూడకపోవడం  తనని ఎంతో బాధించింది ఉదయం నుంచి తిరిగి చూసిన చారిత్రక ఆనవాళ్లు శాసనాల రాళ్లు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి పాఠ్యపుస్తకాలక్కెక్కని చరిత్ర కనీసం పర్యాటకుల  మస్తిష్కాల్లోకి ఎక్కడానికి ఏదైనా చేయాలన్న ఆలోచన నువ్వే కీర్తించాయి ఇంతలో నీలకంఠాపురం చేరుకున్నారు రెడ్డి గారి బృందం.



కామెంట్‌లు