అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 క్రీస్తు శకం 1320 నాటికి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనంలో వీటి ఆచూకీ దొరకడంతో ఆ ముళ్ళ పొదల్లో నే ఎగిరి గంతేశారు రెడ్డి గారు అదే కాలపు మరో శాసనంలో వావిలి పాటి పెద శరభయ్య, చిన్న శరభయ్య ఇద్దరు శిల్ప సోదరులు పార్వతి చెన్నకేశవ మహిషాసుర మర్దని వీరభద్ర నందికేశ్వరుడు విగ్రహాలను చక్కగా వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించాడు అన్న వివరాలు అందులో ఉన్నాయి  పార్వతి చెన్నకేశవ విగ్రహాలు రెండు విడి ఆలయాల్లోనూ మహిషాసుర మర్దని విగ్రహం ప్రధాన ఆలయంలోనూ ఉన్నాయి. ముళ్ళ పొదల్లోని వీరభద్ర నందికేశ్వర విగ్రహాలు ఆ శాస్త్రంలో పేర్కొన్నవేనని నిర్ధారణకు వచ్చారు. రెడ్డి గారు సరిగ్గా సమయం ఉదయం 7:00 అవుతోంది ఉమామహేశ్వర ఆలయాన్ని చేరుకున్నారు ఒకరిద్దరు ఆలయం సిబ్బంది తప్ప జన సంచారం లేదు ఎక్కడ చూసినా గుంపులు గుంపులు కోతులు మాత్రం కనిపిస్తున్నాయి.ఆ కోతులు ఎవరిని ఏమీ చేయటం లేదు కానీ అది ఒక రకమైన భయం బిక్కుబిక్కుమంటూ చివరి దాకా వెళ్లి శ్రీశైలం వెళ్ళే మెట్లను తాకి వెనుకకు వచ్చి ఒక్కో ఆలయాన్ని చూశారు. దేవాదాయ శాఖ వారు అనాలోచితంగా నిర్మించిన సిమెంట్ శాల గ్రామం ఆలయం ప్రాచీనతకు  ముప్పులను కలిగిస్తున్నాయి  బయటి స్తంభాల పైన శాస్త్రాలను పరిశీలిస్తూ ఉండగా పూజారులు వచ్చారు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రెడ్డి గారిని మేము ఇంకా దేవుని సిద్ధం చేయాలి పూజాదికాలు ఉంటాయి ఒక అరగంట తర్వాత రమ్మన్నారు రెడ్డి గారు గర్భాలయం దాకా రాను మండపాల్లో వాస్తు శిరపాలని పరిశీలించడానికి వచ్చాను  గతంలో నేను  దేవాదాయ శాఖలో పనిచేశాను అని చెప్పారు అప్పుడు తప్పక లోనికి రమ్మన్నారు పేరుకు ఆధ్యాత్మిక కేంద్రమే కానీ సుచి శుభ్రంలో ఏమాత్రం ఆ శాఖ వారికి శ్రద్ధ లేదు.  ఒకచోట భైరవుడు మరో చోట మహిషాసుర మర్దని ఇంకొకచోట ప్రతాపరుద్రుని శాసనం దానిపైన ఏవో బండరాళ్లు చూసి చరిత్రకు అపచారం జరుగుతుందని లేంపజేసుకున్నారు రెడ్డి గారు అంతకన్నా ఇంకేం చేస్తారు పాపం ఎప్పుడు బయటపడదామని ఆలోచిస్తున్న రెడ్డి గారు గర్భాలయ అర్ధ మండప ద్వారా శాఖల పైన గల శిల్పం అర్థ మండపం ముందు అలంకార శిల్పంతో శోభిల్లుతూ కాకతీయ శిల్పుల పనితనానికి అద్దం పడుతున్న స్తంభాల కప్పు రాళ్లు వారిని కదలకుండా చేసినాయి ఆలయ ప్రాంగణ నిర్వహణలో ఏమాత్రం శ్రద్ధ లేని అధికారులు పూజారులపై  కోపంతో  రెడ్డిగారు తన్ను తాను బయట పడ్డారు చుట్టూ అస్త వ్యస్త కట్టడాలు.



కామెంట్‌లు