అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తరువాత యాత్ర జ్యోతి- సిద్ధవటం గురించి చెప్పడానికి ముందు  ఆదర్శవాది అంకితభావంతో జీవితాన్ని  విశ్వవిద్యాలయానికి అంకితం చేసిన ఒక  ఉన్నత వ్యక్తిని గురించి పరిచయం చేయబోతున్నారు రెడ్డి గారు. ఆ వివరాలు చూద్దాం  ఆయన ఒక నిజాయితీ పరుడైన మనిషి వేమన తత్వాన్ని వంట పట్టించుకుని ఇంటినిండా వేమన పద్యాల పుస్తకాలతో వ్యాఖ్యాన గ్రంధాలతో నింపారు. అంతేకాదు ఆయన వేమన బోధల్ని ముమ్మూర్తుల ఆచరిస్తున్నాడు కూడా నిక్కచ్చిగా ఉంటాడు నిజాయితీగా బ్రతకడంలో కాకలు తీరినవాడు కాకాలు పట్టేవాడు మాత్రం కాదు కాబట్టే ఏ విశ్వ విద్యాలయ అంకుర దశ నుంచి మొదటి అడుగు వేసే వరకు అన్ని తానే అయి ఉండి అహర్నిశలు కృషి చేసినా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్లర్ కాలేకపోయారు. ఆయన ఎవరో కాదు  కడపలో యోగి వేమన విశ్వ విద్యాలయ స్థాపన ప్రకటన వెలువడినప్పటి నుంచి కొత్త వైస్ ఛాన్స్లర్ కొలువు దీరిన దాకా ప్రత్యేక అధికారిగా కొనసాగించినవాడు వెంకటేశ్వర యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసిన ఆచార్య జీ శివారెడ్డి గారు  వీరు శివనాగి రెడ్డి గారికి చాలా రోజుల నుంచి పరిచయం  రెడ్డిగారు అడపా దడపా కడప పరిసర ప్రాంతాలలో చారిత్రక పర్యటన చేసేటప్పుడు  వారు తన కారును ఇవ్వడమే కాక అన్ని రకాల అతిధ్యాలను అందించిన అందిస్తున్న  పరోపకార పారాయణుడు  ఒకరోజు దినపత్రికలో రెడ్డి గారు తిరుపతి పరిసరాలలో జరిగిన పరిశోధనలపై వచ్చిన వార్తను చూసి  ఫోన్ చేశారు.
మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కడపకు ఎందుకు రాకూడదు ఇక్కడ ఒంటిమిట్ట దేవుని గడప నందలూరు లంజకనుమగుట్ట జ్యోతి సిద్ధవటం ఇలా ఎన్నో ఉన్నాయి మీరు వచ్చారంటే నేను నా కారు సిద్ధం అని చెప్పారు నిజమేనా అనిపించింది రెడ్డి గారికి ఒక శనివారం రాత్రి వెంకటాద్రిలో బయలుదేరి  తెల్లవారుజామున కడప స్టేషన్ లో దిగేసరికి అప్పటికే 70 సంవత్సరాలు దాటి ఉన్న  మహోన్నత వ్యక్తి  రెడ్డి గారిని ఆప్యాయతతో పలకరించే ఆహ్వానించిన తీరు  వారి మనసును పులకరించి ఆహ్వానించిన తీరు ఎంతో అనందాన్ని ఇచ్చింది  చాలాకాలం తర్వాత పులగం తిని రుచిని మళ్ళీ  మదిలో పదులపరుచుకొని  ప్రయాణం ప్రారంభించారు శివ నాగిరెడ్డి గారు.కామెంట్‌లు