అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 శ్రీశైలం నీటి ముంపుకు గురైన వంద దేవాలయాలను ఊడదీసి పునర్నిర్మించారు  అనేక కొత్త ఆలయాలను కూడా నిర్మించారు రెడ్డి గారు. అలా వారికి ఒక మంచి జీవితాన్ని పొందటానికి ఈ శిల్పకళాశాల కారణం శిల్పకళాశాల ప్రిన్సిపాల్ కె వెంకట రెడ్డి గారు సీనియర్ ఫ్యాకల్టీ (చిత్రలేఖనం) డాక్టర్ గిన్నే సాగర్ గారు ఎమ్మెల్యే  వేంకట రెడ్డి గారికి అన్ని విభాగాలు చూపించి తర్ఫీదు నిచ్చి తీరువివరిస్తున్నారు రెడ్డి గారు  ఇంతలో ఎస్ వి భక్తి ఛానల్ లో పనిచేస్తున్న బి.వి.రామ నగర్ నుంచి ఫోన్ తిరుపతి ప్రకారంగా చూద్దామన్నారుగా మండపంపల్లి వెళదామా అన్నారు సరేనన్నారు రెడ్డిగారు ఆయన శిల్పకళాశాలకు వచ్చారు పెంచిన ప్రసాదించిన కారులో రెడ్డి గారు రమణ గారు ఎక్కి అలిపి దాటారో లేదో జానపద పరిశోధకుడు ఆచార్య పేట శ్రీ నుంచి ఫోన్ అన్నా నా తిరుపతి తిరుమల కథలు గంగ జాతర పుస్తకాలు ఇవ్వాలి ఎక్కడ కలవమంటారు అన్నారు.
శివనాగి రెడ్డి గారు రమణ గారు అలిపిరి దాటాం అని చెప్పారు. ఆయన మరో మిత్రులతో కలిసి మమ్మల్ని అడ్డగించి ఆ పుస్తకాలు అందించి మాతో పాటు కారులో దూరారు పిచ్చా పార్టీ మాట్లాడుకుంటూ గంగ జాతర తిట్లు గురించి చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే చంద్రగిరి ఊరు దాటి జాతీయ రహదారి కింద రోడ్ లో  వెళుతున్నారు  పచ్చటి పొలాలు ఘటంగా పెరిగిన చెట్లు అల్లంత దూరాల కొండలు అన్ని కదిరిపోతూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి ఒక ప్రక్క ప్రకృతి అందచందా  లను ఆరాధిస్తూనే రెడ్డి గారి కళ్ళు శిధిల వారసత్వాల కట్టడాల కోసం వెతుకుతున్నాయి  అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి శిల్పాలు కనిపిస్తున్నాయి వారి కోరిక  మాత్రం తీరట్లేదు కారు పదులతోనే ఉంది డోర్నకంబాల బోర్డు కనిపించింది ఆగలేక మంగళంపల్లి ఎంత దూరం అని అడిగేలోపే రమణగారు అదిగో సార్ అదే మండపం పల్లి అని చెప్పారు.
రోడ్డు ప్రక్కనుంచి ఒక 100 అడుగులు లోపలికి వెళ్ళగానే ఒక శిధిల కట్టడం కనిపించింది ముందు ఒక ఎత్తైన మండపం క్రీస్తు శకం 16వ శతాబ్ది ఆలయ వాస్తుకు అర్థం పడుతుంది రమణగారు అందుకొని చంద్రగిరి పాలకుడు రెండో వెంకటపతి రాయలు క్రీస్తు శకం 1585- 1614 వేట కోసం వచ్చినప్పుడు ఈ కట్టడం అతిథి గృహంగా ఉండేదని కార్వేటినగరం చంద్రగిరి వేలూరు చంద్రగిరి మార్గాలకు మండపం పల్లి కూడలిగా ఉండేదని చెప్పారు రెడ్డి గారు కారు దిగి మండపాన్ని సమీపించారు. గ్రామస్తులు వాడిని అదోలా చూస్తున్నారు ఎవరో ఏమిటో అని ఇంతలో ఒక పెద్ద అయినా వచ్చి వారి వివరాలు అడిగారు అతన్ని ఈ మండపాన్ని ఏమంటారు అని అడిగితే రమణగారు చెప్పినట్లే రాజుల విడిది గృహమని వేటకు వచ్చినప్పుడు ఈ మల్లెపూల విశ్రాంతి తీసుకొని బిందారగించి చంద్రగిరి మహల్ కు వెళ్లేవారు స్వామి అని చెప్పాడు.కామెంట్‌లు