అడుగుజాడల్లో ఆనవాళ్లు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 షెడ్లు ఆదాయాన్ని కౌంటర్లు ఏమాత్రం శుభ్రం లేని టాయిలెట్లు మరో క్షణం కూడా అక్కడ ఉండొద్దని తరిమేయగా కారు ఎక్కి కిందకు దిగారు అక్కడ మరో శిథిలాలయం రెడ్డి గారిని పరిచయం చేయరూ అంటూ బిక్కు మొహంతో ప్రాధేయ పడుతోంది. గోడలు కూలిపోయాయి ద్వార శాఖలు వాలిపోయాయి శరీరం రాలిపోయింది ఒకప్పుడు ధూప దీప నైవేద్యాలతో అలరారిన ఆలయంలో గబ్బిలాల గుసగుసలు కాపురం చేస్తున్నాయి రెడ్డి గారిని అక్కడి నుంచి వెళ్ళమని సాగనంపుతున్నాయి ముళ్ల పొదల్లోని వీరభద్ర నంది విగ్రహాలు ఒకదానిపై ఒకటిగా కుప్పబోసిన ఆలయ   విడిభాగాలు స్తంభాలు కప్పులు, షెడ్లు చెప్పుకోలేని బాధల్ని  వెళ్ళగక్కుతున్నాయి    రెడ్డి గారి గుండె బరువెక్కింది చేసేది లేక ఆయన కారు ఏక్కారో లేదో కానీ మరో తీరని కోరిక వారిని వెంటాడుతూనే ఉంది అది కూడా శ్రీశైలం వెళ్లే దారిలోని చారిత్రక ప్రదేశం అదే ప్రతాపరుద్రుని కోట కాకతీయ  ప్రతాపరుద్రుడు కట్టించిన కోట మెలికలు తిరుగుతూ సాగుతున్న కారు ప్రయాణం ఉల్లాసాన్నిస్తోంది కానీ పచ్చటి ప్రకృతి, కొండలు, కోనలు, చెట్లు చేమలు, పుట్టలు, పొలాల గట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఎంత చూసినా  తనివి తీరదు అనిపించింది  మన్ననూర్ ఘాట్ రోడ్ దగ్గర కొంత దూరం వెళ్ళగానే ఎడమవైపు ఒక తోరణం  శ్రీశైలం యాత్రికుల స్వాగత తోరణం అలంకరణ అంతగా లేకపోయినా కాకతీయ వాస్తు శిల్పానికి మచ్చు తునకగా ఉంది దగ్గరగా వెళ్లి రెండు వైపులా చూసి మళ్లీ కారు ఏక్క బోతూ ఉండగా ఎడమవైపున కొనమీద ప్రతాపరుద్రుని కోట గోడలు కట్టిపడేశాయి. రెడ్డిగారు కారు దిగారు చుట్టూ కలయ చూశారు అక్కడ ఉన్న మసీదు దగ్గర జనసంచారం చాలా బాగా ఉంది ఆ కోటకు ఎలా వెళ్లాలి అని వారిని అడిగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి అన్నారు ఆసక్తి సన్నగిల్లినా మరోవైపు నుంచి ఒక అర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు అక్కడ ఒకచోట గుమ్మం ప్రక్కనే దేవాలయాలు కృతి శకం 14వ శతాబ్ది దుర్గా వాస్తు విన్యాసానికి ఒక చక్కటి ఉదాహరణ లోనికి వెళ్లాలని మనసు ఉవ్విళ్లురుతోంది అడవి జంతువులు ఉంటాయి. పోవటం మంచిది కాదు అన్నారు ఫారెస్ట్ గాడ్ గారు కనీసం ఇదన్నా చూసాం అన్న సంతోషంతో చక చకా నడిచి శ్రీశైలం రోడ్డు మీద వరకు వచ్చారు పక్కనే కుడి వైపున కొండ బండరాళ్ళు వాటిపైన  ఆనాటి కాలనీ నుంచి కోట గోడకు రావలసిన విడగొట్టిన పెద్ద సైజు ఉలులు ఇనుప గూటాలు దించిన ఆనవాళ్లు కనిపించాయి పైకి ఎక్కాడు రెడ్డి గారు చాలా రాళ్ళను పగలగొట్టిన గుర్తులు అలనాటి శిల్పులకు మ్రొక్కి తిరుగు ప్రయాణం కోసం కారు ఎక్కారు శివనాగిరెడ్డి గారు.కామెంట్‌లు