అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గర్భాలయం అర్ధమండపం వరకే ఉన్న మాధవ స్వామి ఆలయ గోడల రాళ్లు ఊడిపోయినాయి శిఖరం పైన సున్నపు శిల్పాలు పూతరాలిపోయాయి  ముందున్న ముఖ మహా మండపం కనుమరుగయింది ధ్వజస్తంభం విరిగిపోయింది బలిపీఠం ఎక్కడుందో తెలియదు  ప్రాకారం ఆకారం కోల్పోయింది క్రీస్తు శకం 16-17 శతాబ్దాల్లో సకల అర్చనలు ఉత్సవాలతో కళకళలాడిన ఆలయం నేడు వెలగలబోతోంది ధమ్మాచారి విశ్వకర్మ వాస్తు శిల్ప శాస్త్రాలతో పాటు విశ్వకర్మ అందించిన ఆలయ నిర్మాణ ప్రతి మహా లక్షణాలను బాగా ఆకళింపు చేసుకున్న ఆయన ఈ ఆలయ పుననిర్మాణానికి పూనుకున్నాడు ఆలయ గోడల మీద ఇంకా పరిష్కరణకు నోచుకోని క్రీస్తు శకం 17-18 శతాబ్దాలు శాసనాలు పడిపోయిన ధ్వజస్తంభం తలలేని రాజదంపతుల శిల్పం కొంచెం దూరంలో ఒక బండ్లపై చెక్కిన  ఆ ఆలయ నిర్మాత సాష్టాంగ నమస్కార శిల్పాలు కలిసికట్టుగా ధమ్మాచారి గారిని వేడుకున్నాయో ఏమో ఆలయ జీర్ణోద్దరణకు శ్రీకారం చుట్టబడింది. ఈ సూత్రం ఒక్క నాటకానికే కాదు  సినిమాకు ఆకాశవాణికి కూడా   అన్వయించబడుతుంది  అలాగే శిల్పకళ  నేర్చుకోవడానికి ఒక జీవిత పర్యంతం  దాని పైన కేంద్రీకరించి పని చేయవలసి ఉంటుంది  తాను ఎంత గొప్పగా శిల్పాన్ని చెక్కలని ఊహించడు  దానిలో 80% మాత్రమే చెక్కగలడు  ఇది శాస్త్ర సమ్మతం  అయితే రెడ్డిగారి లో ఉన్న ప్రత్యేకత  తాను చెక్కిన శిల్పాలను గురించి కాకుండా ఇతరులు తదేక దృష్టితో దానిపై కేంద్రీకరించి చెక్కిన ఆ శిల్పాల సొగసులు చూసి  ఆనందించడంతోపాటు అభినందనలు తెలియజేయడం  సామాన్యులకు మింగుడు పడని విషయం  సహజంగా తనకన్నా బాగా చేసిన వారిని మెచ్చుకోవడం  మానవ మస్తిష్కానికి  కుదరని బేరం  అయితే సహృదయులైన  శివ నాగిరెడ్డి గారు  ఒక ప్రేక్షకుని గానే దానిని ఆస్వాదించారు తప్ప శిల్పిగా కాదు అన్న విషయం మనం గమనించాలి.


కామెంట్‌లు